https://oktelugu.com/

Actor Surya: ప్రముఖ నటుడు సూర్యపై పరువు నష్టం దావా కేసు…

Actor Surya: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్​. ఇటీవలే అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు. 1993 లో తన భర్త కోసం ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 07:22 PM IST
    Follow us on

    Actor Surya: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్​. ఇటీవలే అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు. 1993 లో తన భర్త కోసం ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. కానీ అదే స్థాయిలో ఈ సినిమా పై విమర్శలు కూడా వస్తున్నాయి.

    ఈ సినిమాకు సంబంధించి మొదట తమ భాషను కించపరిచారంటూ నార్త్‌ ఇండియన్స్‌ ఫైర్‌ అయ్యారు. ఆ తర్వాత హీరో సూర్యను కొట్టిన వారికి రివార్డు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వన్నియార్‌ సంఘం వారు తమిళనాడు చిదంబరంలోని కోర్టులో హీరో సూర్యపై పరువు నష్టం దావా వేశారు. హీరో సూర్య సహా దర్శకుడు జ్ఙానవేల్‌, నిర్మాత జ్యోతిక, ఈ సినిమా ను ప్రదర్శించిన ఓటీటీ వేదిక అమెజాన్‌ పై సెక్షన్‌ 153, 153 ఏ, 499, 500, 503 504 ప్రకారం చర్యలు తీసుకోవాలని వన్నియార్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుథా అరుల్‌ మోళి తన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

    జై భీమ్‌ సినిమా సభ్యులపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని వన్నియార్‌ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. తమకు రాష్ట్రంలో న్యాయం జరగకపోతే, సుప్రీం కోర్టుకైనా వెళతామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వార్త పట్ల హీరో సూర్య అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.