Nagarjuna Vs Chiranjeevi: సంక్రాంతి కానుకగా వచ్చే సినిమాలు మంచి హిట్ లను సొంతం చేసుకుంటాయి. ఈ డేట్స్ కోసం ఎందరో ఎదురుచూస్తుంటారు. ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమా హిట్ కొట్టడం పక్కా. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు. అయితే ముందు చూపు ఉండాలని పెద్దలు అంటే.. మన స్టార్ హీరోలు వారి సినిమాల కోసం సంవత్సరం ముందుగానే ముందు చూపుతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన నాగ్.. వచ్చే సంవత్సరం కూడా రావడానికి సిద్దమవుతున్నట్టుగా ఉన్నారు.
మన హీరోలు ఏకంగా ఓ ఏడాది ముందుగానే సంక్రాంతి కోసం డేట్లు చూసి పెట్టుకున్నట్టున్నారు. 2025 సంక్రాంతికి రావడానికి ఇప్పటి నుంచే సిగ్నల్స్ ఇస్తున్నారు. మేం రేసులోనే ఉన్నామంటూ ప్రకటిస్తున్నారు. వీరిని గమనిస్తే.. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ప్రాణ స్నేహితుల మధ్య బాక్సాఫీస్ మధ్య యుద్దం తప్పేలా లేదు. మూమూలు టైం కంటే సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రమే కాదు.. కలెక్షన్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ పండుగను ఎక్కువగా సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు.
నాగార్జున లాంటి హీరోలైతే సంక్రాంతికి మరింత ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈ సారి నా సామిరంగ సినిమాతో వచ్చిన నాగార్జున వచ్చే సంక్రాంతికి కూడా కలుద్దాం అంటున్నారు. ప్రస్తుతం ఈయన ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాతో పాటు అనిల్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నారు. ఈ రెండు కాకుండా సంక్రాంతి కానుకగా 2025కు బంగార్రాజు 2ను తీసుకురావాలని అనుకుంటున్నారట. మరోవైపు విశ్వంభరతో చిరంజీవి ఆల్రెడీ పండుగ రేసులో ఉన్నారు. రీ ఎంట్రీలో ఖైదీ నెం.150, వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతికి వచ్చి విజయం సాధించారు.
ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో సంక్రాంతి ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు చిరు. ఈ క్రమంలోనే విశ్వంభరను వచ్చే పండుగకు సిద్దం చేస్తున్నారు దర్శకుడు వశిష్ట. అంటే ప్రాణ స్నేహితుల మధ్య పొంగల్ వార్ ఖాయమే అని టాక్. మరోవైపు శతమానం భవతి సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందట. అంతే కాదు హనుమాన్ మూవీకి కూడా సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలు కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా హిట్? ఏ సినిమా ఫట్ అనేది తెలియాలంటే మరో సంవత్సరం ఎదురుచూడాల్సిందే.