Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కార్: అరేబియా సముద్ర సింహం. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్ చీఫ్ మహమ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబరు 3న ఈసినిమా ప్రేక్షకులను పలకరించేందుసు సిద్ధమైంది.సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో ఈ సినిమాను విడదల చేస్తోంది. మోహన్‌లాల్- ప్రియదర్శన్ కలియకలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఎన్నో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు మలయాళంతో పాటు.. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఎంతో ఆసక్తిగా సాగే ఈ సినిమా.. కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మరక్కర్ టీమ్ చెలిపింది. అర్జున్, సునీల్‌శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తిసురేష్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
Also Read: HariHara Veeramallu: ఫైనల్‌గా తిరిగి పట్టాలెక్కనున్న వీరమల్లు.. షెడ్యూల్ ఎప్పుడంటే?
కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది ఇటీవలే ఓ ప్రచారం సాగింది.. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ.. మరక్కర్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు స్ప,్టం చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
కాగా, గతంలో మన్యం పులి, లూసీఫర్, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్‌లాల్. ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మోహన్‌లాల్ తెలుగులోనూ కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Akhanda Movie: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి…