https://oktelugu.com/

Jayam Ravi : ఇంత అందంగా ఉంది.. ఈమె కోసమేనా? ఆ స్టార్ హీరో భార్యను వదిలేసింది.. తాజాగా క్లారిటీ

కోలీవుడ్ లో ఇటీవల ఓ స్టార్ హీరో విడాకులు ప్రకటించాడు. అందుకు కారణం, అందమైన సింగర్ తో అతడు ప్రేమలో పడటమే అని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లపై సదరు సింగర్ క్లారిటీ ఇచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 29, 2024 / 01:59 PM IST

    Jayam Ravi - Kenisha Francis

    Follow us on

    Jayam Ravi : సదరు హీరో జయం రవి కాగా, సింగర్ కేనీషా ఫ్రాన్సిస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రవి… జయం మూవీతో కోలీవుడ్ హీరోగా మారాడు. తెలుగు బ్లాక్ బస్టర్ జయం చిత్రానికి అది రీమేక్. తమిళంలో సైతం భారీ విజయం సాధించడంతో రవి కాస్తా జయం రవిగా పాప్యులర్ అయ్యారు. జయం రవి కోలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. 2009లో జయం రవి ఆర్తి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురు ఆమె.

    జయం రవికి ఇద్దరు కుమారులు సంతానం. 15 ఏళ్ల వివాహ బంధం అనంతరం జయం రవి విడాకుల ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశం పంచుకున్నాడు. విడాకుల తర్వాత తన ఆస్తులు మాజీ భార్య, పిల్లలకు రాసేసినట్లు జయం రవి తెలియజేయడం విశేషం. జయం రవి విడాకులకు కారణం సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ అనే ప్రచారం మొదలైంది.

    కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం… బెంగుళూరుకు చెందిన కేనీషా గోవాలో సింగర్ గా పని చేస్తుంది. ఆమె గోవా లో గల ప్రముఖ పబ్స్ లో పాడతారు. నటుడు జీవాతో కలిసి కేనీషా ఓ ఆల్బమ్ చేసినట్లు సమాచారం. గతంలో గోవా వెళ్లిన జయం రవికి మిత్రుల ద్వారా కేనీషా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. గోవాలో లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన జయం రవి-కేనీషా లకు పోలీసులు ఫైన్ వేశారు. అతివేగంగా కారును నడిపినందుకు అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చింది.

    దీనికి సంబంధించి చలానా నోటిఫికేషన్ జయం రవి భార్య ఆర్తి మొబైల్ కి వెళ్లిందట. అప్పుడే జయం రవితో ఆర్తికి గొడవలు మొదలయ్యాట. అనంతరం ఆర్తికి కేనీషాతో జయం రవి రిలేషన్ సంగతి తెలిసిందట. ఆ వివాదం పెద్దది కావడంతో విడాకుల వరకు వ్యవహారం వెళ్లిందట.

    అయితే ఈ పుకార్లను కేనీషా ఖండిస్తున్నారు. జయం రవితో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మా మధ్య వృత్తి పరమైన సంబంధం మాత్రమే ఉంది. నాకు జయం రవి మంచి మిత్రుడు. నా కారణంగా జయం రవికి భార్యతో విబేధాలు వచ్చాయి. విడాకులు తీసుకున్నారన్న వార్తల్లో నిజం లేదని, కేనీషా క్లారిటీ ఇచ్చింది.