https://oktelugu.com/

Vijay: రాజకీయాల్లోకి స్టార్ హీరో…త్వరలో కొత్త పార్టీ ప్రారంభం

సామాజిక మరియు రాజకీయ సందేశాలు ఇచ్చే సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు విజయ్. సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోగా ఆయన పేరు ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించగా... పేదలకు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 26, 2024 / 11:42 AM IST
    Follow us on

    Vijay: కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరన్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాల్లోనే కాకుండా ఆయనకు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. 60కి పైగా చిత్రాల్లో నటించిన విజయ్ సూపర్ హిట్స్ ను తన ఖాతాల్లో వేసుకున్నారు. లక్షలాది మంది అభిమానుల గుండెల్లో తనదైన ముద్రను వేశారు.

    సామాజిక మరియు రాజకీయ సందేశాలు ఇచ్చే సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు విజయ్. సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోగా ఆయన పేరు ఉంది. అంతేకాదు ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించగా… పేదలకు ఆర్థిక సాయం కూడా చేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ మరియు ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లో ఉన్నారన్న సంగతి సంగతి తెలిసిందే. అంతేకాదు తమిళనాడులో ప్రముఖ హీరో కమలహాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో విజయ్ కూడా నడవనున్నారట.

    కథనాయకుడిగా రాణిస్తున్న విజయ్ రాజకీయ ప్రవేశం చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీపై మరో వార్త హల్ చల్ చేస్తుంది. విజయ్ త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా చెన్నైలో విజయ్ ‘మక్కల్ ఇయక్కం’ నిర్వాహకులతో సమావేశం అయ్యారు.

    అయితే ఈ సమావేశం అనంతరం విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించాలని పలువురు డిమాండ్ చేశారని సమాచారం. అంతేకాదు విజయ్ కూడా రాష్ట్ర రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది. దాంతోపాటు మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

    విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం పార్టీని కూడా ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రీకరణ పూర్తయిన తరువాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ అభిమానులు భావిస్తున్నారు.