https://oktelugu.com/

Chiranjeevi: కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడనే విషయం మీకు తెలుసా..?

చిరంజీవి మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అయిన ఖైదీ ని మొదట కోదండరామిరెడ్డి కృష్ణ గారితో చేద్దాం అని అనుకున్నాడట.

Written By:
  • Gopi
  • , Updated On : January 26, 2024 / 11:46 AM IST
    Follow us on

    Chiranjeevi: చిరంజీవి స్టార్ హీరో గా ఎదగడానికి గల ముఖ్య కారణం ఎవరు అంటే డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారనే చెప్పాలి. ఆయన ఎక్కువ సినిమాలు చిరంజీవి తోనే చేసి ఆయనకి సూపర్ సక్సెస్ లను అందించాడు. దానివల్లే చిరంజీవి మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అయిన ఖైదీ ని మొదట కోదండరామిరెడ్డి కృష్ణ గారితో చేద్దాం అని అనుకున్నాడట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ కాంబినేషన్ అప్పుడు సెట్ అవ్వలేదు.ఇక దాంతో కృష్ణ కోదండ రామిరెడ్డి తో ఈ సినిమా ని మనం తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్దాం అని ఆయనకి దైర్యం చెప్పాడంట.

    ఇక కోదండరామిరెడ్డి కూడా సరే అని ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశారట, కానీ ఆ తర్వాత ఆ స్టోరీ ని చిరంజీవితో తెరకెక్కించారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా స్టోరీ కృష్ణ గారిదని ఆయన లాక్ చేసిన స్టోరీ ని మీరు వేరే హీరో తో ఎలా చేస్తారని కృష్ణ సన్నిహితులు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ ని అడిగారట దాంతో ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పకుండా కామ్ గా ఉంటే ఇక ఆ మ్యాటర్ మీద కృష్ణ స్పందిస్తూ ఆ ప్రొడ్యూసర్ తో మాట్లాడి సరే ఈ మూవీ చిరంజీవి తోనే చేయండి, ఆయన కూడా ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు.

    ఇక ఈ సినిమాతో ఆయనకి కూడా ఒక మంచి హిట్ పడుతుంది అంటూ కృష్ణ చాలా పాజిటివ్ గా స్పందించడంతో ఆ ప్రొడ్యూసర్ ఒకే అని చిరంజీవి తోనే ఆ సినిమా తీసి ‘ఖైదీ’ పేరుతో ఆ సినిమాని రిలీజ్ చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక చిరంజీవి కెరియర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ సినిమా అదే కావడం విశేషం…ఇక కృష్ణ ఆరోజు అలా పాజిటివ్ గా స్పందించడంతో ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్ళింది. చిరంజీవి కి ఒక సూపర్ సక్సెస్ దక్కింది. అలా చిరంజీవి స్టార్ హీరో అవ్వడం లో కృష్ణ కూడా ముఖ్య పాత్ర పోషించాడు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి…