Actor Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన అసురన్ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అయితే తెలుగులో ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా తెలుగులో రెండో సినిమాకి రెడీ అవుతున్నాడు ధనుష్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా ప్రొడక్షన్ నెం. 14గా నిర్మిస్తున్నారు. దీనికి ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం చేయనున్నారు. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. రేపు ఉదయం 9గంటల 36 నిమిషాలకు టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Actor Dhanush
Also Read: అచ్చం ‘సమంత’లాగే రెచ్చి పోయింది !
ఈ సినిమాకు ‘సర్’ (SIR) టైటిల్ ఖరారు చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇదే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. గురువారం ఉదయం 9.36 గంటలకు ఈ టైటిల్ వెల్లడించనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా కంటే ‘సర్’ ముందుగా సెట్స్ మీదకు వెళ్లనుంది అని అంటున్నారు. అందుకే, ధనుష్ కూడా ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ లో తన ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా అని పేర్కొన్నట్లు తెలుస్తుంది. రఘువరన్ బీటెక్, మారి చిత్రాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తతో ధనుష్ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
My next Tamil film and my first direct telugu film .. title announcement tom 🙏🙏 Om Namashivaaya pic.twitter.com/cnaeMXO2h0
— Dhanush (@dhanushkraja) December 22, 2021
Also Read: బాలయ్య సినిమాలో మరో యాక్షన్ హీరో ?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Star hero dhanush ready to do his second film in telugu under sithara entertainments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com