Ashu Reddy: ఎలాగూ ఐటెం సాంగ్ చేసేశాం, ఇక సైలెంట్ గా ఉండటం ఎందుకు అనుకుంటున్నట్లు ఉంది సమంత. ఇప్పటికే ఆ సాంగ్ పై తనదైన శైలిలో బోల్డ్ గా కామెంట్స్ చేసింది. పైగా ఆ సాంగ్ తన మనసుకు బాగా దగ్గర అయింది అంటూ సెలవిచ్చింది. ఏది ఏమైనా సమంత వ్యవహారం ఈ మధ్య కాస్త వెరీ బోల్డ్ గా తయారైంది. అయితే, ఇప్పుడు సమంతకి తోడు ఆశు రెడ్డి కూడా తోడు అయింది.

సమంత తన కెరీర్ లో చేసిన మొదటి ఐటెం సాంగ్ తనకు ఎంతో బాగా నచ్చింది అని, అందుకే.. “ఊ అంటావా ఊహు అంటావా” పాటకి డ్యాన్స్ చేశాను అని ఆశు రెడ్డి చెప్పుకొచ్చింది. ‘బిగ్ బాస్ 3’తో ఆశు రెడ్డి ఫేమస్ అయింది. అప్పటి నుంచి హీరోయిన్ గా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది గానీ, ఆమెకు హీరోయిన్ గా ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదు.
అందుకే, ఎలాగూ తనకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి.. ఇక “ఊ అంటావా ఊహు అంటావా” సాంగ్ కి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. పైగా సమంతలాగే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్స్ పోజింగ్ విషయంలో తాను కూడా ఏ మాత్రం తగ్గేది లేదు అని నిరూపించింది. పైగా ‘ఊ అంటావా బావా’ అంటూ నెటిజన్లను ఒక ఊపు ఊపేసింది.
Also Read: Balayya: బాలయ్య సినిమాలో మరో యాక్షన్ హీరో ?
తాను డ్యాన్స్ చేసిన వర్కింగ్ స్టిల్స్ ని ఆశు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. మొత్తానికి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పైగా సమంతకి ఇది నా ట్రిబ్యూట్ అంటూ ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. “పుష్ప” సినిమాలోనే సమంత పాట 100 మిలియన్ల పైగా వ్యూస్ ను సాధించింది. చైతుతో డివోర్స్ తర్వాత సామ్ చేసిన మొదటి గ్లామరస్ సాంగ్ కావడంతో ఇండస్ట్రీ కూడా సామ్ సాంగ్ పై బాగా ఇంట్రెస్ట్ చూపించింది.
Also Read: Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !