Shankar : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ లాంటి దర్శకుడు మరొకరు లేరు అనేది వాస్తవం… ఎందుకంటే ఆయన కరప్షన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి ఆయన స్టైల్ లో ట్రీట్ మెంట్ ని జోడించి తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. అలాగే అతన్ని స్టార్ డైరెక్టర్ గా కూడా నిలబెట్టాయి. శంకర్ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తూనే, ప్రేక్షకుల్లో ఒక తెలియని ఫీల్ ను కలిగిస్తాయి. శంకర్ గ్రాఫిక్స్ లో గాని, విజువల్స్ ను టాప్ నాచ్ లో చూపించడంలో గాని అతన్ని మించిన డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి శంకర్ రీసెంట్ గా ‘భారతీయుడు 2 ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయింది. అయిన కూడా విజువల్స్ పరంగా మాత్రం ఆయన మరొకసారి తన గ్రాండీయర్ ను అయితే చూపించాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన ప్లాప్ లా పరంపరను కొనసాగించారు. ఇక రాబోయే ‘గేమ్ చేంజర్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే శంకర్ తన కెరియర్ మొదట్లో’భారతీయుడు ‘ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఇక ఆ సినిమా తర్వాత ఆయన కొంచెం కొత్తగా ఒక లవ్ స్టోరీ ని తీద్దాం అని అనుకొని అందులో భాగంగానే ప్రశాంత్ ఐశ్వర్య రాయ్ ని హీరో హీరోయిన్స్ గా పెట్టి ‘జీన్స్ ‘ అనే సినిమాని చేశాడు. మొదట ఇందులో హీరోగా అప్పుడే ‘ప్రేమదేశం ‘ అనే సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న అబ్బాస్ ను తీసుకోవాలని అనుకున్నాడట. కానీ ప్రేమదేశం సినిమా సక్సెస్ తర్వాత ఆయనకి చాలా ఆఫర్లు వచ్చాయి. దానివల్ల ముందు కమిట్ అయిన సినిమాలు ఉండటం వల్ల శంకర్ సినిమాను రిజెక్ట్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చిందని అబ్బాస్ ఒక సందర్భంలో తెలియజేశాడు. ఈ ఆ ఒక్క సినిమా కనక చేసుంటే అబ్బాస్ కెరియర్ అనేది టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయేదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉంటారు.
ఇక అలా శంకర్ సినిమాని రిజెక్ట్ చేసిన అబ్బాస్ ప్రస్తుతం సినిమాలు లేక న్యూజిలాండ్ కి వెళ్లి చాలారోజులు అక్కడొక పెట్రోల్ బంకులో పనిచేసి ప్రస్తుతానికి అక్కడ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా స్థిరపడ్డాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు. నిజానికి అబ్బాస్ చాలా మంచి నటుడు అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాడు. ప్రేమ దేశం సినిమా వచ్చిన సమయంలో ఆయన క్రేజ్ అయితే టాప్ రేంజ్ లో ఉండేది. ఇక ఇప్పటికి కూడా మనలో చాలామంది హెయిర్ కట్ ని కొంచెం వెరైటీగా చేయించుకుంటే అబ్బాస్ కటింగ్ చేయించావా అని అంటూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప కీర్తిని అందుకున్న ఆయన అనుకోకుండా తన సినీ కెరియర్ ని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం.
ఇక ఇప్పటికి ఆయన న్యూజిలాండ్ లోనే ఉంటూ తన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు…అయితే చాలా సంవత్సరాల పాటు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికి అవేవి ఆయనకి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. కాబట్టే ఆయన న్యూజిలాండ్ కు వెళ్ళిపోయారు. చూడాలి మరి ఇప్పుడు ఏదైనా మంచి ఆఫర్ వస్తే మళ్ళీ అబ్బాస్ తిరిగి సినిమాల్లో నటిస్తాడా లేదా అనేది…