Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన హరిహర వీరమల్లు, సినిమాతో నిరాశపరిచినప్పటికి ఓజీ సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మేకర్స్ అందరు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2026వ సంవత్సరంలో రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో ఎప్పుడు చేయనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టాడు. పవన్ కళ్యాణ్ ఎనర్జీని వాడుకొని బ్లాక్ బస్టర్స్ సాధించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.
తమిళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజు సైతం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆయన కనక పవన్ కళ్యాణ్ తో సినిమాని సెట్ చేసుకోగలిగితే మాత్రం అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… లోకేష్ కనకరాజ్ తో పాటు సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఎవరిని ఫైనలైతే చేయడం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమా ఫైనల్ చేశాడు అంటే ఆ సినిమా ఎన్ని రోజులపాటు సెట్స్ మీద ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి ఆయనతో సినిమా కమిట్ అయిన దర్శకులు అన్ని రోజులపాటు ఆ మూవీ మీదనే వాళ్ల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది…