https://oktelugu.com/

Star Directors-Music Directors : మ్యూజిక్ డైరెక్టర్లను మారుస్తున్న స్టార్ డైరెక్టర్లు…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆడియన్స్ కి సినిమా అంటే కేవలం హీరోలు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మిగతా వాళ్లను అసలు వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో భాగం కాదని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక సినిమా తెరమీద కనిపించాలంటే ఎంతమంది కష్టపడుతుంటారనే విషయం వాళ్లకు తెలియదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 10:01 PM IST

    Harish Shankar

    Follow us on

    Star Directors-Music Directors :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న వాళ్ళు వాళ్ళ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి సినిమాకి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వాళ్ల దగ్గర నుంచి మ్యూజిక్ ను రాబట్టుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు వాళ్ళ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లను కాకుండా వేరే వాళ్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి డైరెక్టర్ హరీష్ శంకర్ దేవి శ్రీ ప్రసాద్ ను చాలా ఎక్కువ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇక కాలక్రమేణ ఆయనే అతని సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించినప్పటికి రీసెంట్ గా ఆయన చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి మిక్కిజే మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇక దానికి కారణం ఏదైనా కూడా మిక్కిజే మేయర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం వల్ల మిస్టర్ బచ్చన్ సాంగ్స్ కొద్ది వరకు పర్లేదు అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఆయన చాలావరకు వైవిధ్యం అయితే ప్రదర్శించారు. ఇక ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు సైతం మిక్కిజే మేయర్ ని ఎక్కువ సినిమాలకి రిపీటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు.

    కానీ ఇప్పుడు మాత్రం కుబేర సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ను తీసుకున్నాడు. దానికి కారణం ఏంటి అంటే వీళ్ళ కాంబో లో వచ్చే సినిమాల్లో ఎప్పుడు ఒకే రకమైన మ్యూజిక్ వస్తున్న నేపధ్యంలో మిక్కిజే మేయర్ ను మార్చి దేవి శ్రీ ప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

    అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు మ్యూజిక్ ని దేవిశ్రీప్రసాద్ అయితేనే ఇవ్వగలడని శేఖర్ కమ్ముల భావించినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే హరీష్ శంకర్, శేఖర్ కమ్ముల ఇద్దరు స్టార్ డైరెక్టర్లుగా వెలుగుందుతున్నారు. వీళ్లిద్దరూ ఏకకాలంలో వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ ను మార్చారు.

    హరీష్ శంకర్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాల్సిన దేవిశ్రీప్రసాద్ శేఖర్ కమ్ముల సినిమాకి, ఇక శేఖర్ కమ్ముల సినిమాకి మ్యూజిక్ ఇవ్వాల్సిన మిక్కి జే మేయర్ హరీష్ సినిమాలకి మ్యూజిక్ ని అందించడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో భారీ సక్సెస్ అందుకోవాలంటే మాత్రం మ్యూజిక్ డైరక్టర్లు కీలక పాత్ర వహించాల్సిన అవసరమైతే ఉంది…