https://oktelugu.com/

Trivikram Srinivas : పవన్ కళ్యాణ్ కొడుకు మహేష్ బాబు కొడుకుతో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్…

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తమను తాము స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకోవడానికి చిన్న హీరోలు సైతం పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మెగా ఫ్యామిలీ లోని పవన్ కళ్యాణ్, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు వీళ్లిద్దరూ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సమయంలో వాళ్ళ వారసుల ప్రస్తావన మరోసారి తెర పైకి వచ్చింది...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 06:42 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తను స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం కొద్దిగా సినిమాలకు విరామం ఇచ్చినప్పటికీ వీలు చూసుకొని సెట్స్ మీద ఉన్న సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత వరుస సినిమాలకు కమిటీ అవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతోనే ముందుకు సాగుతుంటాడు. ఇక మహేష్ బాబు ఎక్కువగా కాంట్రవర్శి ల్లో ఇరుక్కోడు. అలాగే ఆయన బయట కూడా ఎక్కువగా కనిపించడు. ఇక ఆయన ఉంటే సినిమా సెట్ లో ఉంటాడు. లేకపోతే ఇంట్లో ఉంటాడు అంతే తప్ప బయట మాత్రం ఎక్కడ కనిపించడు. పబ్ లు, పార్టీలు అంటూ ఎటు తిరగడు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణలు తొందర్లోనే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ హీరోలు కాబట్టి వీళ్ళ వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతోనే ఉంటారు. అందుకే తమ తమ కొడుకుల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు హీరోలను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట. ఇక ఒకే సినిమాతో వాళ్ళిద్దరిని లాంచ్ చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి.

    త్రివిక్రమ్ వీళ్లిద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేసి ఇద్దరిని ఒకేసారి లాంచ్ చేయాలని చూస్తున్నాడట. ఇక త్రివిక్రమ్ ఇద్దరికీ చాలా మంచి సన్నిహితుడే కాబట్టి అతను అనుకుంటే అవుద్ది అని మరి కొంతమంది అంటున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా వారసుల ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తే ఆ సినిమా భారీ సక్సెస్ ను సాధించడమే కాకుండా మొదటి సినిమాతోనే వీళ్ళిద్దరూ టాప్ రేంజ్ కి వెళ్లిపోతారనే చెప్పాలి…