Prashanth Neel : ప్రశాంత్ నీల్ కి సినిమాల కంటే డబ్బే ముఖ్యమా..? అందుకే ఆయన అలా చేస్తుంటాడా..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ల వెనకే హీరోలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సక్సెస్ అనేది కీలకం కాబట్టి దర్శకులకు సక్సెస్ వచ్చిందంటే చాలు ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆ దర్శకుడి తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందుకే సినిమాల పట్ల దర్శకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 28, 2024 6:55 pm

Prashanth Neel

Follow us on

Prashanth Neel :  కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చూసే ప్రేక్షకుడికి గూజ్ బంప్స్ తెప్పిస్తు ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎన్టీఆర్ తో చేయబోతున్న సబ్జెక్టు కూడా ఇలాంటిదే కావడం విశేషం… మరి తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉన్న నేపధ్యం లో ఎన్టీఆర్ కి కూడా భారీ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఎలివేశన్స్ ను సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ఎప్పుడు డార్క్ మూడ్ లోనే సినిమాలను చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇక అతనికి అది అచ్చొచ్చిన ఫార్మాట్ కాబట్టి ఇప్పటికీ అందులోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ప్యాషనేట్ గా సినిమాలను చేసేవారట. ఆయన మొదట చేసిన ఉగ్రం సినిమా కన్నడ ఇండస్ట్రీలో అంత మంచి పేరు అయితే తీసుకురాలేదు. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిందని చాలామంది చెప్తూ ఉంటారు. దాంతో ప్రశాంత్ నీల్ సినిమాలు కేవలం డబ్బుల కోసం మాత్రమే చేయాలి వాటి మీద ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోకూడదని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట.

ఎందుకంటే ఎమోషన్స్ తో సినిమా మీద ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకవేళ అది తేడా కొడితే మన మనసును మనం బాధించుకుంటూ చాలా వరకు డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి సినిమా అనేది డబ్బుల కోసమే చేయాలి. సినిమాని ప్యాషన్ తో చేయకూడదనే మాటను ఆయన మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడట.

ఒకవేళ సినిమా తేడా కొట్టిన కూడా ఆయన పెద్దగా డిప్రెషన్ లోకి వెళ్లకుండా చాలావరకు దానిని అధిగమిస్తూ ముందుకు ఎలా వెళ్లాలి అనే విషయం మీద ఆలోచిస్తూ మరొక కథని సిద్ధం చేసుకుంటూ ఉంటాడట. అందుకే ఆయనకు సినిమా కంటే కూడా డబ్బులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతుంటాడు. ఒక ప్రొడ్యూసర్ సినిమా ప్లాపై డబ్బులను కోల్పోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు కాబట్టే ఆయన సినిమాల కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అంటూ తనే స్వయం గా ఒక సందర్భంలో చెప్పడం విశేషం…