https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ లాంటి సినిమాలు నేను చేయలేను అంటున్న స్టార్ డైరెక్టర్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో దర్శకులు కూడా చాలా వరకు కీలకపాత్ర వహిస్తున్నారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 12:28 PM IST

    Sandeep Reddy Vanga

    Follow us on

    Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ మాత్రం ప్రభాస్ తోనే స్పిరిట్ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఆయన రాసుకున్న స్టోరీ కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి చాలా బాగా సెట్ అవుతుందంటూ ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే కమర్షియల్ సినిమా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ మీద కొన్ని కామెంట్లు చేశాడు.

    సందీప్ వంగ బ్రిలియంట్ డైరెక్టర్ అని చెబుతూనే ఆయన లాంటి సినిమాలు నేను చేయలేను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ సక్సెస్ లుగా నిలిచాయి.

    ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేస్తున్న సినిమాలను మిగతా వాళ్ళు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆయన ఒక డిఫరెంట్ వేలో సినిమాని ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. తద్వారా ఆయనకు భారీ సక్సెస్ రావడమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

    మరి ఇలాంటి సందర్భంలో ఒక స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతూ అనిల్ రావిపూడి సందీప్ రెడ్డి వంగ ను మెచ్చుకోవడం అతని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడడం చూసినట్లయితే మరి ఏది ఏమైనా కూడా ఈ దర్శకుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ అయితే ఉందని వాళ్ళు చాలా చక్కటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు…