Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా పాన్ వరల్డ్ లో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఆయన సినిమా కోసం ఎదురుచూసే రోజులైతే వచ్చాయి. ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం దాదాపు 1000 కోట్లకు పైన బాడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా పర్సంటేజ్ రూపంలో షేర్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఒక్క పార్ట్ కోసం 1000 కోట్ల బడ్జెట్ అయితే అవుతున్నట్టుగా తెలుస్తోంది…
అయితే ఈ సినిమా దాదాపు 3000 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే విషయం అయితే చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. మరి ఇందులో 40% షేర్ మహేష్ బాబు తీసుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక 3000 కోట్లలో దాదాపు 1200 కోట్ల వరకు మహేష్ బాబు ఈ సినిమా ప్రాఫిట్ లో నుంచి షేర్ అయితే తీసుకోబోతున్నట్టుగా వార్తలతో వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు మూడు సంవత్సరాల పాటు తన సమయాన్ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటికే ఒక సంవత్సరం సమయాన్ని వృధా చేసిన మహేష్ బాబు మూడు సంవత్సరాలలో ఒక సంవత్సరానికి 400 కోట్ల చొప్పున 1200 కోట్ల రూపాయలను తీసుకోవడంలో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరమైతే ఏమీ లేదు.
ఎందుకంటే మహేష్ బాబు సంవత్సరంలో ఒక సినిమా చేసిన కూడా అతనికి 100 కోట్ల రెమ్యూనరేషన్ అయితే ఇస్తారు. ఇక ఆయనకి ఆడ్స్ రూపంలో మరో రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఈజీగా వస్తాయి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని మహేష్ బాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది… ఇక ఈ నిర్ణయంతో ప్రొడ్యూసర్స్ కూడా ఏకీభవించినట్టుగా తెలుస్తోంది…