Rajinikanth : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి మారింది వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టామినాని చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…మరి రజినీకాంత్ లాంటి హీరో కూడా ఇప్పుడుఅంచి సినిమాలు చేస్తూ పాన్ ఇండియాలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు…
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక స్టైల్ ఉంటుంది. అలాగే ఆ హీరోని తమ అభిమానులు ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో అలాంటి సీన్లలో దర్శకులు చూపిస్తూనే సినిమాలో కొత్తదనాన్ని కూడా యాడ్ చేసి చూపించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నిజానికి కమర్షియల్ హీరోలందరికీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కీలకంగా మారుతుంటాయి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరో రజనీకాంత్…ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రతి సినిమాలో కూడా ఆయన సిగరెట్ తాగుతూ స్టైల్ గా నడుస్తూ చాలా మంది రౌడీలను కొడుతూ అగ్రెసివ్ గా డైలాగులు చెబుతూ ఉంటారు. ఇలాంటి వాటికోసమే రజినీకాంత్ సినిమాలను ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు అంతే తప్ప ఆయన కామ్ గా ఉండి మాట్లాడకుండా ఉంటే చూసే ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే రాదు. అలాగే ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని కూడా సాధించదనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రజనీకాంత్ 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ తన అభిమానులను ఆనంద పరచడానికి చూస్తున్నాడు అంటే ఆయనకి సినిమాల మీద ఎంత డెడికేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
జైలర్ 2, కూలీ లాంటి యాక్షన్ ఎపిసోడ్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక తన చివరి శ్వాస వరకు తను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన రజనీకాంత్ హెల్త్ ఇబ్బంది పెడుతున్నప్పటికీ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు చేయబోయే సినలతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన చేస్తున్న జైలర్ 2 సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఆ వీడియోలో రజనీకాంత్ తన స్వాగ్ ను మరొకసారి చూపిస్తూ సినిమా మీద హైప్ అయితే పెంచేశాడు…