Star Director: ఒక సినిమాకు 150 ఖర్చు చేస్తేనే ఆమ్మో..ఇంత బడ్జెట్ అవసరమా అని అనుకుంటాం. అలాంటిది ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసం అక్షరాలా 150 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారంటే నమ్ముతారా?, కానీ నమ్మి తీరాలి, ఎందుకంటే అది పచ్చి నిజం కాబట్టి. ఒక తమిళ స్టార్ డైరెక్టర్, బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ని పెట్టి ఒక కమర్షియల్ యాడ్ చిత్రీకరణ ప్రస్తుతం ముంబై లో జరుపుతున్నారట. ఒక టాలీవుడ్ యంగ్ హీరోయిన్, బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో మరియు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న విలన్ ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొంటున్నారట. ఇంతకీ వీళ్ళు ఏ ప్రోడక్ట్ కి యాడ్ చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక్క కమర్షియల్ యాడ్ కోసం ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనేది విశ్లేషిద్దాం.
ఈమధ్య కాలం లో స్టార్ హీరోలు కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి పాతిక కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటిది ముగ్గురు స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ కమర్షియల్ యాడ్ కి ఆ మాత్రం ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి?, కేవలం ఈ ముగ్గురి రెమ్యూనరేషన్స్ 50 కోట్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత షూటింగ్ లొకేషన్స్ లో వేసే సెట్స్, గ్రాఫిక్స్ కి అయ్యే ఖర్చు, ఇలా చాలా లెక్కలే ఉంటాయి. ఇక ఈ యాడ్ కి దర్శకత్వం వహిస్తున్న ఆ తమిళ స్టార్ డైరెక్టర్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది. ఆయన కూడా ఒక 20 కోట్ల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేసి ఉంటాడు. కేవలం రెమ్యూనరేషన్స్ లెక్కలు కలిపే 100 కోట్లు అయ్యేట్టు ఉంది. ప్రస్తుతం ఈ వార్త పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ టాపిక్ గా మారింది.