https://oktelugu.com/

Star Director : ఆ స్టార్ డైరెక్టర్ ఆ కమెడియన్ కి ఛాన్స్ ఇచ్చి టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాడు..ఆ డైరెక్టర్ కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి కూడా సహాయం చేయని కమెడియన్…

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది కొంతమందికే దక్కుతుంది. ఇండస్ట్రీ లో కష్టపడిన ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హిట్ ప్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే మనం ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడి గుడ్ అటెంప్ట్ అనిపించుకుంటే చాలా మనకి మరిన్ని మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉంటాయి...

Written By: , Updated On : February 13, 2025 / 08:22 AM IST
Star Director

Star Director

Follow us on

Star Director : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇక్కడ చాలా మంచి అవకాశాలైతే దొరుకుతాయి. అయితే మరి కొంతమందిని కొందరు దర్శకులు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్లని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ బిహేవియర్ లో తేడా రావడం వాళ్ళను వాళ్ళు స్టార్లుగా గుర్తించుకోవడం లాంటివి చేస్తూ మిగతా వాళ్ళందర్నీ తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల అవకాశం ఇచ్చిన వాళ్ళు సైతం ఇక మొదట వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే భయపడిపోతుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఒక నార్మల్ వ్యక్తి ని స్టార్ కమెడియన్ గా మార్చాడు… స్టార్ డైరెక్టర్ చేసిన చాలా సినిమాల్లో అతన్ని హైలెట్ చేసి చూపించాడు. అయినప్పటికీ ఆ డైరెక్టర్ చివరి రోజుల్లో ఆ కమెడియన్ దగ్గరికి వెళ్లి కొంతవరకు ఆర్థిక సహాయం కావాలని అడిగినప్పటికి ఆయన మాత్రం తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో డైరెక్టర్ ఒక్కసారిగా చాలా బాధను అనుభవించారట. నేను తీసుకొచ్చిన వ్యక్తి, నా ఇంట్లో నేను అన్నం పెట్టిన మనిషి నా పరిస్థితి బాగాలేదని డబ్బులు అడిగి మళ్లీ కొద్దిరోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పినప్పటికి ఆయన దగ్గర డబ్బులు ఉండి కూడా లేవని చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటూ తన సన్నిహితులు దగ్గర ఆ దర్శకుడు చెప్పారట. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో అవసరం ఉన్నంత సేపు అందరూ మనవాళ్ళే అనుకుంటారు. అవసరం తీరిన తర్వాత వాళ్ల ఒరిజినల్ ఫేస్ అయితే బయటికి వస్తుంది.

మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సహాయం చేస్తే చేయాలి. అంతే తప్ప వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదనేది మాత్రం వాస్తవం… ఎందుకంటే ఇక్కడ ఎవరి కోసం ఎవరు ఏమి చేయరు. ఒకవేళ కొంతమంది తన మన అనే భేదాలు లేకుండా అందరినీ ఆదరించినప్పటికీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పాలి.

ఎదుటి వారి నుంచి ఎంత తక్కువగా ఆశిస్తే ఇక్కడ మనం అంత హ్యాపీగా ఉంటాం… ఇండస్ట్రీలో చాలామంది అవకాశం ఇచ్చిన వాళ్ళ గురించి సైతం తర్వాత రోజుల్లో చాలా హీనంగా మాట్లాడుతూ వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కమెడియన్ ను మనం ఈ విషయంలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు…

ఇక ఇలాంటి సిచువేషన్స్ అనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి. వీటివల్ల ఇండస్ట్రీకి రాబోయే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల నుంచి ఏమీ ఆశించకుండా ఓపెన్ మైండ్ తో వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగితే మంచిదని చాలామంది సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…