Syria
Syria: రష్యా.. పశ్చిమాసియాపై పట్టు నిలుపుకునేందుకు ఆ దేశాలకు విరివిగా సాయం అందిస్తోంది. అమెరికా వ్యతిరేకతను పెంచుతోంది. ఈ క్రమంలో రష్యా మీడయా 2024, అక్టోబర్ 1న ఓ వీడియోను ప్రసారం చేసింది. సిరియా కోస్తా ప్రాంతం లటకియాలోని ఎయిర్‌పోర్టు సమీపంలో సాగుతున్న తంతును ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా రికార్డు చేసిన వీడియో అది. ఈ ప్రాంతం అసద్ అన్న బసిల్ పేరుతో ఉండేది. 2015 నుంచి సిరియాలో మోహరించిన రష్యా సాయుధ దళాలకు ఇది ప్రధాన స్థావరం. ఎయిర్ పోర్టు చూపుతూ మొదలైన వీడియోలో ఇరన్ విమానం ఖెష్మ్ ఫార్స్ ఎయిర్ లోగోతో ఉన్న బోయింగ్ రవాణా విమానం రన్‌వే మీదరకు వస్తుంది. తర్వాత విమానంలో వస్తువులు దింపడం కనిపిస్తుంది. ఆ వస్తువుల్లో దుప్పట్లు, బొమ్మలు కనిపిస్తాయి. శరణార్థులు, చెల్లాచెదురైన వారి కోసం రష్యా పంపిన మానవతాసాయంగా ఓ అధికారని తెలిపారు. అయితే ఈ వీడియో తర్వాత రష్యా హమీమిమ్ సైనిక స్థావరానికి దగ్గర ఉన్న గిడ్డంగిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. అంటే వీడియోకు వైమానిక దాడికి సంబంధం ఉంది.
దుప్పట్లు పేలతాయి..
ఇదిలా ఉంటే రష్యా పంపిన మానవతాసాయంలో పేలుడు పదార్థాలు ఉండడమే ఇజ్రాయెల్ దాడులకు కారణంగా తెలుస్తోంది. ’’దుప్పట్లు కూడా పేలతాయని ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని హమీమిమ్ వ్యవహారాల గురించి తెలిసిన ఒకరు తెలిపారు. మానవతాసాయం పంపిణీ పేరుతో ఇరాన్, రష్యా మిలటరీ స్థావరం ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తుందా అని అడగగా ఆ దుప్పట్లు అత్యంత తీవ్రతతో పేలాయంటే హమీమిమ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి అని వెల్లడించాడు. సిరియాలోని రష్యా వైమానిక స్థావరం హమీమిమ్ లెబనాన్‌కు ఇరాన్ ఎగుమతులకు కీలకమైన రవాణా కేంద్రం కాదని ప్రాంతీయ నిపుణుడు నికితా స్మాగిన్ పేర్కొన్నారు. ఇరాన్ ఉపరితల రవాణా సౌకర్యాలపై ఆధారపడింది. దీనిని ఇజ్రాయెల్ తరచుగా టార్గెట్ చేస్తుంది. దీంతో రష్యా స్థావరాల మీదుగా కాకుండా ఎగుమతుల సిరియా, లెబనాన్‌కు చేరుకున్నాయి.
రష్యన్లను మానవ కవచంగా…
హమీమిమ్ వైమానిక స్థావరం దగ్గర ఆయుధాల రవాణాకు సంబంధించి ఇరాన్ విమానాన్ని 2023 ప్రారంభంలో గుర్తించామని ఇజ్రాయెల్‌క్షిఫెస్ప్ ఫోర్స్ రిటైర్డ్‌ఫ్టినెంట్ కల్నల్ సరిత్ జెహావి తెలిపారు. డమాస్కస్, అలెప్పో ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ నిఘా ఉందని పేర్కొన్నారు. అందుకే ఇరాన్ ప్రాత్యామ్నాయం వెతుక్కుంటుందని వెల్లడించారు. సిరియాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా రష్యన్లను మానవ కవచాలుగా వాడుకుంటున్నట్లు ఆరోపించారు.
పిల్లల బొమ్మలతో పాటు ఆయుధాలు..
ఇక నవంబర్‌లో ఐడీఎఫ్ దక్షిణ లెబనాన్‌లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రసారం చేసింది. అందులో బ్యాగులు, బాక్సులు, బొమ్మలతో నిండి ఉన్న గది కనిపించింది. ఓ సైనికుడు నిలబడిన తర్వాత కెమెరా గదిలో ఓ మూలకు మళ్లింది. గోడ పగలగొట్టి చూడగా అందులో రష్యా తయారు చేసిన ఆయుధాలు కలషింకోవ్ రైఫిల్స్, కార్నెట్ యాంటీ టాంక్ మిస్సైల్ సిస్టమ్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిని ఐడీఎఫ్‌తో సంఘర్షణ కోసం కాకుండా పట్టణాలపై దాడుల కోసం ప్రతీ ఇంట్లో ఐదారుగురికి సరిపడా ఉన్నాయి. సిరియా నుంచి ఆయుధాలను రోడ్డు మార్గంలో లెబనాన్‌కు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న దక్షిణ లెబనాన్‌లోని సెటిల్‌మెంట్ల నుంచి ఇజ్రాయెల్ పట్టణాలపై కార్నెట్ మిస్సైల్స్‌తో దాడి చేయవచ్చు.
హిజ్‌బుల్లా చేతికి రష్యా ఆయుధాలు?
సిరియా నుంచి లెబనాన్‌కు ఆయుధాలు వచ్చి ఉంటాయని భావిస్తునానరు. అవి హిజ్‌బుల్లా చేతికి చేరుతుననట్లు తెలుస్తోంది. వాటిసాయంతోనే ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేస్తున్నట్లు సమాచారం. అసద్ కాలం చివరి వరకు రష్యా ఆయుధాలను హిజ్‌బుల్లాకు అందించినట్లు తెలుస్తోంది.
’ఆయుధాలు అలా సరఫరా అవుతున్నాయని వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్లు ఏమీ చేయరు’’ అని స్మాగిన్ తెలిపారు. 2022 వరకు ఇజ్రాయెల్‌తో మైత్రికి ప్రాధాన్యం ఇచ్చిన రష్యా.. తర్వాత హిజ్‌బుల్లాకు ఆయుధాలు సరఫరాతో ఇజ్రాయెల్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ అభిప్రాయాలను కూడా రష్యా పట్టించుకోలేదు.
సిరియాలో ఏం జరగనుంది?
సిరియా ఆర్మీకి హిజ్‌బుల్లా మంచి స్నేహితుడు. సిరియాలో ఉన్న రష్యా బలగాల సమన్వయంతో పనిచేసేది. ఇజ్రాయెల్ దాడులతో జరిగిన నష్టంతో హిజ్‌బుల్లా బలహీనపడింది. బషర్ అల్ అసద్ పాలన ముగియడం కూడా ఓ కారణం. దీంతో సిరియాలో మిగిలి ఉన్న ఆయుధాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ తీవ్రంగా దాడులు చేస్తోంది. దీంతో సిరియాలోని 80 శాతం ఆయుధాలు వృథాగా మారాయి.