https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘టికెట్ 2 ఫినాలే’ ఇచ్చినా గెడ్డం గీసుకోనూ అంటూ నాగార్జునకి తెగేసి చెప్పిన పృథ్వీ..ఇంత యాటిట్యూడ్ ఏంటో!

నాగార్జున పృథ్వీ గెడ్డం గీయించుకుంటే ఎవరికీ ఇవ్వని ఆఫర్స్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. ముందుగా ప్రైజ్ మనీ కి 2 లక్షలు అదనంగా జమ చేస్తామని చెప్పుకొచ్చాడు, ఆ తర్వాత మూడు లక్షలు అన్నాడు, దానిని మళ్ళీ పొడిగిస్తూ 5 లక్షలు చేసాడు. ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా పృథ్వీ ఒప్పుకోడు. అయితే కనీసం తన లాభం కోసం అయినా ఒప్పుకుంటాడేమో అని నాగార్జున పృథ్వీ ని టెంప్ట్ చేస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 09:31 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: గత వారం బిగ్ బాస్ హౌస్ లో చాలా సంఘటనలు జరిగాయి. కచ్చితంగా ఇవి సీరియస్ గా మాట్లాడుకోవాల్సినవి, నాగార్జున వీటి గురించి మాట్లాడి చాలా సీరియస్ కోటింగ్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో అది జరగలేదు. నభీల్, మెహబూబ్ తమ కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యింది. దీని గురించి ప్రస్తావించి, ఎవరో ఒకరికి నాగార్జున రెడ్ కార్డు వార్నింగ్ ఇస్తాడని అనుకున్నారు ఆడియన్స్. కానీ అది కూడా జరగలేదు. నిఖిల్, గౌతమ్ మధ్య వాష్ రూమ్ లో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ మొత్తం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు, కానీ చివర్లో నిఖిల్ ఉద్దేశపూర్వకంగా గౌతమ్ మెడ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తాడు, గౌతమ్ కి చాలా గాయాలు అవుతాయి. ఇది కచ్చితంగా రాక్షసంగా ప్రవర్తించిన తీరు అనే చెప్పాలి.

    దీనిని ఒక హోస్ట్ గా నాగార్జున అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ ప్రస్తావనే తీసుకొని రాలేదు. కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ సెన్స్ లేకుండా జరిగిందని, ఇంకోసారి అలా చెయ్యొద్దు అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలాడంటే. ఇదంతా పక్కన పెడితే పృథ్వీ గెడ్డం మీద నాగార్జున ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వడాన్ని చూసి, అసలు ఈ షో ఎటు వైపు పోతుందిరా బాబు అని ఆడియన్స్ అనుకున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో పృథ్వీ, అవినాష్ లకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తూ, గెడ్డం, జుట్టు మేము చెప్పిన విధంగా కట్ చేయించుకుంటే ప్రైజ్ మనీ కి డబ్బులు మరికొంత జమ చేస్తామని ఆఫర్ ఇవ్వడం, దానికి పృథ్వీ ఒప్పుకోకపోవడం, అవినాష్ ఒప్పుకోవడం,ప్రైజ్ మనీ కి 50 వేల రూపాయిలు అదనంగా జమ అవ్వడం వంటివి మనం చూసాము.

    అయితే నాగార్జున పృథ్వీ గెడ్డం గీయించుకుంటే ఎవరికీ ఇవ్వని ఆఫర్స్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. ముందుగా ప్రైజ్ మనీ కి 2 లక్షలు అదనంగా జమ చేస్తామని చెప్పుకొచ్చాడు, ఆ తర్వాత మూడు లక్షలు అన్నాడు, దానిని మళ్ళీ పొడిగిస్తూ 5 లక్షలు చేసాడు. ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా పృథ్వీ ఒప్పుకోడు. అయితే కనీసం తన లాభం కోసం అయినా ఒప్పుకుంటాడేమో అని నాగార్జున పృథ్వీ ని టెంప్ట్ చేస్తాడు. గెడ్డం గీయించుకుంటే రెండు వారాలు నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ ఇస్తా అంటాడు, అయినా ఒప్పుకోడు, రెండు వారాలు కాదు, ఏకంగా మూడు వారాలు ఇస్తా అంటాడు అయినా ఒప్పుకోడు, పోనీ నీకోసం వద్దు, విష్ణు ప్రియకి నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ ఇస్తా, ఆమె కోసం అయినా ఒప్పుకో అంటాడు, కానీ పని జరగలేదు, టికెట్ టు ఫినాలే ఇచ్చినా కూడా నేను గెడ్డం గీయించుకోను సార్ అని తెగేసి చెప్తాడు పృథ్వీ, ఇక్కడే ఆయన యాటిట్యూడ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే మాట్లాడుకోవాల్సిన సీరియస్ విషయాలు ఎన్నో ఉండగా, ఇలాంటి సిల్లీ మ్యాటర్ గురించి అంతసేపు చర్చించడం ఏమిటి అంటి సోషల్ మీడియా నెటిజెన్స్ నాగార్జున పై విమర్శలు చేస్తున్నారు.