https://oktelugu.com/

Sekhar Master: శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. బోరుమని ఏడుస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్! ఎందుకీ వరుస మరణాలు? అసలు ఏమైంది?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారు. తాజాగా శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యుల్లో మరొకరు మరణించారు. ఈ నేపథ్యంలో శేఖర్ మాస్టర్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ సందేశం ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 2, 2024 / 04:12 PM IST

    Sekhar Master

    Follow us on

    Sekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతి చెందారు. తమ్ముడి మరణంతో శేఖర్ మాస్టర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నెలల వ్యవధిలో శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇద్దరు కన్నుముశారు. స్టార్ కొరియోగ్రాఫర్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

    శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లీడ్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు. చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేస్తున్నారు. మరోవైపు బుల్లితెర షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. శేఖర్ మాస్టర్ ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యుడు. కెరీర్ బిగినింగ్ లో కష్టాలు పడిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు నిలదొక్కుకున్నాడు. టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.

    స్టార్ ఇమేజ్ వచ్చాక శేఖర్ మాస్టర్ బుల్లితెర సెలెబ్ కూడా అయ్యారు. ఢీ డాన్స్ రియాలిటీ షోతో శేఖర్ మాస్టర్ బాగా పాప్యులర్ అయ్యాడు. ఢీ సీజన్ 2, ఢీ 5, ఢీ జూనియర్స్ సీజన్ 1, ఢీ జూనియర్స్ సీజన్ 2, ఢీ 10తో పాటు పలు షోలకు ఆయన జడ్జిగా వ్యవహరించారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఆహా లో ప్రసారమైన కొన్ని షోలలో కూడా సందడి చేశాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ హన్సిక ఆయనతో పాటు జడ్జిగా ఉన్నారు.

    షో ఏదైనా శేఖర్ మాస్టర్ ఎనర్జీ వేరు. తన మార్క్ పంచులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఢీ షోలో శేఖర్ మాస్టర్, హైపర్ ఆది కాంబినేషన్ నవ్వులు పూయిస్తోంది. ఒకరిపై మరొకరు వేసే పంచులు అద్భుతంగా పేలుతాయి. అప్పుడప్పుడు వేదికపై డాన్సులు వేస్తూ కంటెస్టెంట్స్ లో స్ఫూర్తి నింపుతాడు. అయితే ఈ బుల్లితెర స్టార్ వ్యక్తిగత జీవితాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి.

    శేఖర్ మాస్టర్ తమ్ముడు మరణించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు… ” సుధా నిన్ను మిస్ అవుతున్నాం .. నేను ఎక్కడికి వెళ్ళినా .. ఏం చేస్తున్నా .. నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు ఇక లేవు .. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు అనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటావు అని అనుకుంటున్నా .. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మిస్ యూ రా తమ్ముడు’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీనిపై అనసూయ భరద్వాజ్ స్పందించింది. ధైర్యంగా ఉండాలి అని కోరింది.

    అలాగే సెలెబ్రెటీలు, సినీ ప్రముఖులు శేఖర్ మాస్టర్ పెట్టిన పోస్ట్ పై స్పందిస్తూ ఆయనకు ధైర్యం చెబుతున్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా శేఖర్ మాస్టర్ ప్రస్తుతం పలు మూవీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అంతేకాదు పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఢీ, కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ వంటి షోల్లో బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. అలాగే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.