spot_img
Homeఎంటర్టైన్మెంట్Anchor Suma : స్టార్ యాంకరమ్మ ఈ వయసులో కూడా తగ్గడం లేదు.. సూపర్ స్టైలిష్...

Anchor Suma : స్టార్ యాంకరమ్మ ఈ వయసులో కూడా తగ్గడం లేదు.. సూపర్ స్టైలిష్ సుమను చూశారా?

Anchor Suma : సుమ కనకాల పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్స్ లో సూపర్ స్టార్ అని చెప్పొచ్చు.  ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం.

పెద్ద పెద్ద హీరోలు కూడా సుమకు గౌరవం ఇస్తారు. కేవలం యాంకర్ గా చూడరు. ఒక మలయాళీ అమ్మాయి తెలుగు యాంకర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం ఊహించని పరిణామం. జాబ్ రీత్యా సుమ తండ్రి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. దాంతో సుమ తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది.  సుమ కెరీర్ మొదలైంది నటిగానే కావడం విశేషం.
కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమ హీరోయిన్ గా చేశారు. ఈ చిత్ర హీరో స్టార్ రైటర్ వక్కంతం వంశీ కావడం మరొక విశేషం. దాసరి నారాయణరావు దర్శకుడు కాగా… మూవీ ఆశించినంతగా ఆడలేదు. అనంతరం మలయాళంలో మూడు చిత్రాలు చేశారు. ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని తెలుగు సీరియల్స్ లో నటించిన సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. ఈ రంగంలో సుమకు తిరుగు లేకుండా పోయింది.
సుమ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ విడిపోయారట. పెళ్ళైతే యాక్టింగ్ మానేయాలని రాజీవ్ కనకాల కండిషన్ పెట్టడంతో సుమ హర్ట్ అయ్యారట. కొన్నాళ్ళు డిస్టెన్స్ మైంటైన్ చేసిందట. మనసు మార్చుకున్న రాజీవ్ నీ ఇష్టమైన రంగం ఎంచుకో నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్య తెలుగు యాంకర్స్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. దాంతో సుమ కూడా తగ్గడం లేదు. కోటు సూటులో సూపర్ స్టైలిష్ లుక్ సుమ మెస్మరైజ్ చేశారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version