https://oktelugu.com/

Sreemukhi: మల్లెపూలు పెట్టుకుని శ్రీముఖి కైపెక్కించే ఫోజులు… చూపులతో చంపేస్తున్న స్టార్ యాంకర్, వైరల్ ఫోటోలు

శ్రీముఖి పటాస్ షో వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. యాంకర్ రవితో పాటు పటాస్ షోలో సందడి చేసింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రసారమైన పటాస్ ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది. యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 6, 2024 / 09:27 AM IST
    Follow us on

    Sreemukhi: యాంకర్ శ్రీముఖి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుంది. అమ్మడు గ్లామర్ కి దాసోహం అంటున్న జనాలు పిచ్చిగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా అమ్మడు సంచనాలు చేస్తుంది. టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. శ్రీముఖి హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిందట. అయితే ఆమెకు అవకాశాలు రాలేదు. హీరోయిన్ అవడం అంత ఈజీ కాదని తెలిసి… బుల్లితెర వైపు అడుగులు వేసింది.

    శ్రీముఖి పటాస్ షో వేదికగా ఫేమ్ తెచ్చుకుంది. యాంకర్ రవితో పాటు పటాస్ షోలో సందడి చేసింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రసారమైన పటాస్ ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది. యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యింది. హౌస్లో సత్తా చాటిన శ్రీముఖి ఫైనల్ కి వెళ్ళింది. టైటిల్ రేసులో నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి టైటిల్ కోసం పోటీపడ్డారు.

    అయితే రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా, శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ రూపంలో భారీగా రాబట్టిందని సమాచారం. బిగ్ బాస్ షో తర్వాత శ్రీముఖికి ఆఫర్స్ పెరిగాయి. గత రెండేళ్లలో శ్రీముఖి చేస్తున్న షోల సంఖ్య బాగా పెరిగింది. ఒక దశలో అరడజను షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు. సుమ, రష్మీ వంటి స్టార్స్ ని వెనక్కి నెట్టి శ్రీముఖి దూసుకుపోతుంది. మరోవైపు నటిగా అడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది.

    శ్రీముఖి గత ఏడాది విడుదలైన భోళా శంకర్ తో ఓ పాత్ర చేసింది. ఏకంగా చిరంజీవితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. శ్రీముఖికి సినిమా ఆఫర్స్ వస్తున్నా… ఆచితూచి ఎంచుకుంటుంది అట. మంచి సబ్జక్ట్స్ ఎంచుకోవడం ద్వారా నటిగా కూడా ఎదగాలనేది ఆమె కల. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. శ్రీముఖి తాజాగా చోళీ లెహంగా ధరించి, కొప్పున మల్లెలు పెట్టి కైపెక్కించే ఫోజుల్లో రచ్చ చేసింది. శ్రీముఖి గ్లామరస్ లుక్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు.