Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: చీర కట్టులో మైమరపించే అనసూయ సోయగాలు... స్టార్ యాంకర్ ట్రెడిషన్ లుక్ వైరల్

Anasuya Bharadwaj: చీర కట్టులో మైమరపించే అనసూయ సోయగాలు… స్టార్ యాంకర్ ట్రెడిషన్ లుక్ వైరల్

Anasuya Bharadwaj: అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. రంగస్థలం మూవీలో దర్శకుడు సుకుమార్ అనసూయకు రంగమ్మత్త పాత్ర ఇచ్చాడు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కాగా… ఆమెకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుండి అనసూయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. పూర్తి స్థాయి నటిగా మారిన అనసూయ యాంకరింగ్ కూడా వదిలేసిన విషయం తెలిసిందే. దాదాపు 9 ఏళ్ళు అనసూయ జబర్దస్త్ లో ఉంది. 2022లో ఆ షో నుండి తప్పుకుంది. అనసూయ జబర్దస్త్ మానేయడానికి పలు కారణాలు చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదని. అవి లేని రోజున మరలా యాంకరింగ్ చేస్తాను అన్నారు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడేవారు. వారి జోకులకు నేను కోప్పడితే… చూపించకుండా ఎడిట్ చేసి ఎపిసోడ్ ప్రసారం చేసేవారని అనసూయ ఓ సందర్భంలో అన్నారు. ఆమెను బుల్లితెర ప్రేక్షకులు మిస్ అవుతున్నారు అనేది నిజం.

అయితే సోషల్ మీడియాలో అనసూయ అందుబాటులో ఉంటుంది. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలు పంచుకుంటుంది. తాజాగా చీరలో ముగ్ద మనోహరం గా సిద్దమై కనిపించింది. నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. నిండైన చీరలో అనసూయ మనసులు దోచేసింది. ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక అభిమానులు కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని కితాబు ఇస్తున్నారు.

అనసూయ నెక్స్ట్ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో అలరించనుంది. లేడీ విలన్ గా మరోసారి సత్తా చాటనుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అత్యంత ఆతృతగా పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే విడుదలకు సిద్దమైన రజాకార్ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేసింది. మరోవైపు పలు పట్టణాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ అనసూయ లక్షలు సంపాదిస్తుంది.

Exit mobile version