Peddi Movie Flashback: రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchhibabu ) దర్శకత్వంలో వస్తున్న పెద్ది (Peddi) సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని బుచ్చిబాబు తన అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాలో చేస్తున్న తన క్యారెక్టర్ ని పరిచయం చేసింది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
Also Read: ‘డ్యాన్స్ వేద్దాం పదా’ అంటూ అల్లు అర్జున్ తో బాలయ్య సరదా సంభాషణ!
అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. అందులో శివరాజ్ కుమార్ తన ఊరి కోసం పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఆ లెగసిని రామ్ చరణ్ కంటిన్యూ చేస్తూ సినిమా మొత్తం ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినప్పుడు మాత్రమే ఆయనకు మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. లేకపోతే ఆయన మార్కెట్ మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది…
ఎవరు ఎలాంటి సినిమాలు చేసినప్పటికి రామ్ చరణ్ చేసినటువంటి మంచి సినిమాలను స్టార్ హీరోలు ఎవరు చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆయన చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సక్సెస్ ఫుల్ ఫెయిల్యూర్ల విషయాలను పక్కన పెడితే ఆయన మంచి సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…