Chiranjeevi And K Viswanath: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Also Read: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఇక ఇప్పుడు ఉన్న హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు…ఒకప్పుడు కే విశ్వనాథ్ (K Vishwanath) లాంటి స్టార్ డైరెక్టర్ చాలా గొప్ప సినిమాలను తీశాడు. అందుకే ఆయనకు చాలా మంది అభిమానులుగా మారారు…అయజ చేసిన సినిమాలతో చాలా మంది స్టార్ హీరోలుగా మారారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కమల్ హాసన్ లాంటి నటుడు సైతం ఆయన సినిమాల్లో చేసిన తర్వాతనే ఆయనకి అంతమంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కమల్ హాసన్ ను చాలా గొప్పగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు… కానీ విశ్వనాధ్ గారు మాత్రం కమల్ హాసన్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. సాగర సంగమం లాంటి సినిమాలో అతన్ని ఒక క్లాసికల్ డ్యాన్సర్ గా చూపించిన విధానం హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఇప్పటికి ఆ సినిమా చాలా మందికి ఫేవరెట్ సినిమాగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆ సినిమాను విశ్వనాథ్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే దానిని స్క్రీన్ మీద అద్భుతంగా నటించి మెప్పించడం లో కమలహాసన్ (Kamal Hasan) చాలా వరకు సక్సెస్ అయ్యాడు…
ఇక కే విశ్వనాథ్ నాట్యానికి సంబంధించిన సినిమాలను కమల్ హాసన్ తో చేసి చిరంజీవితో మాత్రం స్వయంకృషి లాంటి ఒక చెప్పులు కుట్టుకునే వాడి పాత్రలో చిరంజీవిని చూపించాడు నిజానికి ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే చిరంజీవికి అప్పట్లో మాస్ ఇమేజ్ ఉండేది.
కాబట్టి ఆ మాస్ ఉన్న చిరంజీవి ఈ సినిమాలో చెప్పులు కొట్టుకుంటూ ఉండటాన్ని చూసిన చాలామంది అతని అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిజానికి డాన్స్ కి ప్రాముఖ్యత ఉన్న సాగరసంగమం (Sagara Sangamam) లాంటి సినిమాని సైతం చిరంజీవితో చేయొచ్చు. ఎందుకంటే చిరంజీవి కూడా చాలా బాగా డాన్సులు వేస్తాడు.
కానీ కె విశ్వనాథ్ మాత్రం చిరంజీవిని అలాంటి పాత్రలో చూపించలేదు. ఇక ఈ విషయం మీదనే అప్పట్లో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా చిరంజీవి మాత్రం స్వయంకృషి (Swayam Krushi) సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమాతో ఆయనలో ఉన్న ఒక వినూత్నమైన నటుడు కూడా బయటకు వచ్చాడనే చెప్పాలి…