Today 23 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శనివారం కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. అయితే దుబారా ఖర్చుల విషయంలో ఆలోచించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల వల్ల వ్యాపారులు లాభపడతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు పోలికలక్షలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఊహించని ధన లాభాన్ని పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల దుబారా ఖర్చుల విషయంలో ఆలోచించాలి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అయితే తోటి వారి సహాయంతో సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారులు కొన్ని ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్యవర్తుల జోక్యంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు. కొందరు స్నేహితులే మోసం చేయవచ్చు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ సమయంలో అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేసేవారు సొంత వాహనాలపై వెళ్లకూడదు. రాని బాకీలు ఈరోజు వసూలు అవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అదనంగా ఖర్చులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యల్లో ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : బంధువుల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగుల సంతృప్తిగా ఉంటారు. కొందరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబంలో సమస్యలు తొలగిపోవడంతో సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. దూర ప్రయాణాలు చేసే వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. తోటి వారి సహాయంతో ఉద్యోగులు అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు ఉండడంతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. కొన్ని వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.