Mahesh Babu 30th Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… నిజానికి మహేష్ బాబు ఎప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు అంటే ఎవరు అనేది చాలామందికి తెలియదు. కానీ ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ రాజమౌళికే వెళుతుంది…ఇక ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక రాజమౌళి తో చేస్తున్న ఈ సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకొని ఇప్పటి వరకు ఎవరు నమోదు చేయనటువంటి గొప్ప విజయాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయంశంగా మారింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తో చేస్తున్న ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్టార్ హీరో గా ఎదిగి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళబోతున్నాడు.
Also Read: దిల్ రాజు గారి వైఫ్ ‘తేజస్విని’ అస్సలు తగ్గట్లేదుగా?
కాబట్టి ఆ స్టాండర్డ్ ని మ్యాచ్ చేయగలిగే కథలను తీయగలిగిన దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సందీప్ రెడ్డివంగా మొదటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి సందీప్ రెడ్డి వంగతో మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు 30వ సినిమాను సందీప్ రెడ్డి వంగ తో చేయబోతున్నాడు అంటూ మహేష్ బాబు కాంపౌండ్ నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి… మరి దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట.
Also Read: నాగ చైతన్య వారసుడు హీరో కాడా… ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో
ఇప్పటికే సందీప్ మహేష్ ను కలిసి ఒక కథ కూడా వినిపించాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నమ్రతా సందీప్ చెప్పిన కథను కూడా ఫైనల్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే మాత్రం సందీప్ గానీ, లేదా మహేష్ బాబు గాని స్పందించాల్సిన అవసరమైతే ఉంది…