Pawan Kalyan SSMB29 Look: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) మూవీ మొదలై చాలా రోజులైంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ ని కూడా బయటకు రానివ్వకపోవడం తో అభిమానుల్లో తీవ్రమైన అసహనం చెలరేగింది. రాజమౌళి మరీ అతి చేస్తున్నాడు, కనీసం సినిమా మొదలైంది అని చెప్పడానికి ఏమి నొప్పి అంటూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి మహేష్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో తిట్టేవారు. నేటితో మహేష్ బాబు 50 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నారు. గోల్డెన్ ఇయర్ లోకి అడుగుపెట్టడం తో మహేష్ అభిమానులు ఈ చిత్రం నుండి కనీసం ఒక్క అప్డేట్ అయినా వస్తే బాగుండును అని అనుకున్నారు. కానీ రాదు అని తెలియడం తో తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
Also Read: నీ గొప్ప మనసుకు సలాం.. రియల్ హీరో అనిపించుకున్నావ్
కానీ గోల్డెన్ ఇయర్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే అసలు బాగుండదు అనే ఉద్దేశ్యంతో కాసేపటి క్రితమే రాజమౌళి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ వేసాడు. ఆయన మాట్లాడుతూ ‘మీరంతా మా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. కానీ ఈ సినిమాకు ఉన్న స్కోప్, స్టోరీ ని చెప్పడానికి కేవలం ఒక్క ప్రెస్ మీట్ సరిపోదు. మేము ఇప్పటి దీనిని రివీల్ చేయడానికి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కనీవినీ ఎరుగని పద్దతిని అనుసరించబోతనున్నాము. అదేంటో నవంబర్ నెలలో రివీల్ చేస్తాము. మీ ఓపిక, సహనం కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఆయన మహేష్ బాబు ప్రీ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.
Also Read: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు.. ఈ ట్విస్ట్ ఊహించలేదు!
మహేష్ బాబు మెడలో త్రిసూలం, నంది, డమరుకం బొమ్మలతో ఉన్న రుద్రాక్ష మాలని ఈ ప్రీ లుక్ లో మనం చూడొచ్చు. ఆయన చాతి మీద రక్తం కూడా ఉంది. టీ షీట్ ధరించి ఉన్నాడు. చూస్తుంటే ఈ సినిమాని కూడా డివోషనల్ టచ్ తోనే తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇదే లుక్ తో గతం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘బ్రో ది అవతార్'(Bro The Avatar) చిత్రం ప్రీ లుక్ కూడా వచ్చింది. అది కూడా ఇలాగే నంది, త్రిసూలం బొమ్మలతో తయారు చేసిన దండ లాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అందులో టీ షర్ట్ ధరించి ఉన్నాడు. దీనిని అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి, పవన్ కళ్యాణ్ లుక్ ని కాపీ కొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో నిత్యం ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగాంగానే ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి.