SSMB29 : దర్శక ధీరుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… తన ఎంటైర్ కెరీర్ లో తీసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టాయి… ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ గా ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. నవంబర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తానని గతంలో చెప్పిన రాజమౌళి ఈనెల 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీ వేదికగా మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఈ సినిమాలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ముగ్గురు నటిస్తున్నట్టు గా వార్తలు వచ్చాయి. కానీ ఏదీ కూడా అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇస్తూనే సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. దానికోసమే రామోజీ ఫిలిం సిటీ లో 20 కోట్లు పెట్టి ఒక సెట్ వేస్తున్నాడు.
ఇక దీన్ని కూడా కమర్షియల్ గా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈవెంట్ ను టెలికాస్ట్ చేయడం కోసం ప్రముఖ ఓటిటి సంస్థ కు రైట్స్ అప్ప చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికోసం దాదాపు 50 కోట్ల వరకు ఆ ఓటిటి సంస్థ అమౌంట్ ని చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఏది చేసినా ఒక సెన్సేషన్ గా నిలుస్తోంది. కాబట్టి ఇది కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అవ్వబోతోంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
రాజమౌళి సినిమా కోసం ఒక్క రూపాయి పెట్టిన కూడా దానికి డబుల్ త్రిబుల్ ప్రొడ్యూసర్ కి సంపాదించి పెడుతూ ఉంటాడు. కాబట్టి రాజమౌళితో సినిమా చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి సినిమా ఏ రేంజ్ లో ఆడుతోంది. తద్వారా ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను వసూలు చేస్తుందనేది తెలియాల్సి ఉంది…