Bandla Ganesh : బండ్ల గణేష్(Bandla Ganesh)..ఒకప్పుడు ఈ పేరు తీస్తే మన అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేవాడు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసే ప్రసంగాలు ఆ రేంజ్ లో ఉంటాయి. ‘మై నేమ్ ఈజ్ గణేష్..మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్’, ‘ఈశ్వరా..పరమేశ్వర..పవనేశ్వర’ అంటూ ఆయన ఇచ్చిన ప్రసంగాలు అభిమానులకు పూనకాలు రప్పించేవి. ఒక సాధారణమైన కమెడియన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, తన వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బులతో రవితేజ ని హీరో గా పెట్టి ‘ఆంజనేయులు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ చిత్రం చేసాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయం లో మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది.
ఆ తర్వాత బండ్ల గణేష్ ఎలాంటి సినిమాలు చేసాడో మనమంత చూసాము. ఒక్క మహేష్ బాబు, ప్రభాస్ తో తప్ప, దాదాపుగా అందరి స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేసేసాడు. టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకడిగా మారిపోయాడు. అలాంటి బండ్ల గణేష్ అకస్మాత్తుగా ఇండస్ట్రీ నుండి మాయం అయిపోయాడు. సినిమాలను నిర్మించడమే కాదు, నటించడం కూడా మానేసాడు. మధ్యలో రాజకీయాల్లో కూడా ప్రయత్నం చేసాడు కానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈమధ్య కాలం లో ఎక్కడ నుండి ఊడిపడ్డాడో తెలియదు కానీ, ఏ చిన్న సినిమా ఈవెంట్ జరిగినా బండ్ల గణేష్ ఉంటున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ ఇచ్చిన ప్రసంగం ఎంత వైరల్ అయ్యిందో, ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాకు బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. ఆ తర్వాత తెలుసు కదా మూవీ సక్సెస్ ఈవెంట్ లో కూడా బండ్ల గణేష్ మెరిశాడు.
ఇక్కడ పెద్దగా కాంట్రావెర్షియల్ కామెంట్స్ పెద్దగా చేయలేదు కానీ, నిన్న జరిగిన ‘K ర్యాంప్’ సక్సెస్ ఈవెంట్ లో, హీరో విజయ్ దేవరకొండ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన పరోక్ష కామెంట్స్ ఇండస్ట్రీ లో కలకలం రేపింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ. బండ్ల గణేష్ ని ఎందుకు చిన్న సినిమాల నిర్మాతలు అడిగి మరీ తమ ఈవెంట్స్ కి పిలిపించుకుంటున్నారు అంటే అందుకు ముఖ్య కారణం ఇదే. బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. సినిమా ఆడియన్స్ కి మొత్తం, తమ సినిమా ఒకటి విడుదల అయ్యింది అనే విషయాన్నీ తెలియజేసేలా చేస్తోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి మాత్రమే భజన చేసే బండ్ల గణేష్, ఇప్పుడు చిన్న సినిమాలను పైకి లేపే కార్యక్రమం పెట్టుకున్నాడు. చూడాలి మరి ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు అనేది.