SSMB29 Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై రోజురోజుకి అంచనాలు తారాస్థాయిలో చేరిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహేష్ పుట్టినరోజున అభిమానులు అప్డేట్ కావాలని గోల చేస్తుంటే, నవంబర్ నెలలో చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్ లో అప్డేట్ ని రివీల్ చేయబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. కేవలం ఆ ఒక్క అప్డేట్ తప్ప ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు రాలేదు. రీసెంట్ గా అడవుల్లో మహేష్ బాబు పై షూట్ చేస్తున్న సమయం లో ఎవరో లొకేషన్ లో తీసిన ఒక వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు ఎన్ని ఎడిటింగ్ వీడియోలు వచ్చాయో లెక్కే లేదు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఒక అభిమాని అయితే ఒక అడుగు ముందుకు వేసి మహేష్ బాబు, రాజమౌళి మూవీ ట్రైలర్ ఇలా ఉంటుంది అని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి క్రియేట్ చేశారు. ఈ ట్రైలర్ కి నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే ఇది AI వీడియో లాగానే అనిపించడం లేదు, ఒరిజినల్ వీడియో లాగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇప్పటికే చాలా వచ్చాయి. రాజమౌళి ఇచ్చిన మాట ప్రకారం నవంబర్ నెలలో అప్డేట్ ఇవ్వకపోతే మహేష్ అభిమానులు ఏకంగా సినిమానే AI చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేలా ఉన్నారు. ఆ రేంజ్ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఎంత వరకు ఈ ఎడిటింగ్ వీడియోస్ ట్రెండ్ మహేష్ , రాజమౌళి మూవీ పై కొనసాగుతుంది అనేది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ ఎడిటెడ్ ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి.
#SSMB29 Trailer !!
“Excited to share the trailer with you all ️
Don’t forget to retweet ✨#MaheshBabu @urstrulyMahesh pic.twitter.com/NjHoU4tSV0
— MADHU (@HumanSunami) September 9, 2025