https://oktelugu.com/

AC in electric cars: ఎలక్ట్రిక్ కార్లలో AC ఆన్ చేస్తే మైలేజ్ తగ్గుతుందా? ఈ కంపెనీ చేసిన పరీక్షలో ఏం తేలింది? 

ఎలక్ట్రిక్ కార్ల వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయని కొన్ని నివేదికలను బట్టి తెలుస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో ఈవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో తక్కువ ధరలోఎక్కువ మైలేజ్ ఇచ్చేకార్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే కొన్ని చర్యల వల్ల ఈవీల్లో మైలేజ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 26, 2024 4:08 pm
    Ac cars

    Ac cars

    Follow us on

    AC in electric cars:  ప్రస్తుతం విద్యత్ కార్లదే హవా సాగుతోంది. పెట్రోల్,డీజిల్ కార్లు ఉన్నవారు సైతం వాటి స్థానంలో ఈవీలను చేర్చుతున్నారు. ఈవీలకు సరైన విద్యుత్ ఛార్జీలు లేనప్పటికీ భవిష్యత్ లో అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లను కొంటున్నారు. ఎలక్ట్రిక్ కార్ల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ వస్తుందన్న విషయం ఇప్పటికే  చాలా మందికి అర్థమయింది. అయితే పెట్రోల్, డీజిల్ కార్లలో ఏసీ ఆన్ చేయడం వల్ల వాటి మైలేజ్ తగ్గుతుంది. సాధారణ మైలేజ్ కంటే కనీస కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణం చేస్తారు. మరి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ కార్లలో కూడా మైలేజ్ తగ్గుతుందా?  మరి ఆ విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి.
    ఎలక్ట్రిక్ కార్ల వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయని కొన్ని నివేదికలను బట్టి తెలుస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో ఈవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో తక్కువ ధరలోఎక్కువ మైలేజ్ ఇచ్చేకార్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే కొన్ని చర్యల వల్ల ఈవీల్లో మైలేజ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారులో ఏసీ తప్పనిసరిగా ఉంటుంది. ఏసీ లేకుండా ప్రయాణం చేయడం కష్టం కూడా. అయితే పెట్రోల్, డీజిల్ కార్లలాగే ఎలక్ట్రిక్ కార్లలో ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజ్ తగ్గుతుందా? అనే  సందేహం చాలా మందికి ఇప్పటికే వచ్చింది. దీనిపై కొన్ని కంపెనీలు పరీక్షించారు.
    దేశంలో టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయిన కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఎన్నో మోడళ్లను అందించిన ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏసీ ఆన్ చేయడం వల్ల ఎలాంటి మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులుపరీక్షించారు. ముందుగా ఈ కంపెనీకి చెందిన ఈవీ కర్వ్  కారును తీసుకున్నారు. ఇందులో 55 కిలో వాట్ బ్యాటరీ ప్యాకప్ ఉంది. ఇది 61 శాతం బ్యాటరీతో  పనిచేస్తుంది. అయితే ఏసీ ఆన్ చేసి 30 నిమిషాల పాటునిరంతరాయంగా నడిపించారు. ఈ సమయంలో కారులో  ఉష్ణోగ్రత 24 ఉన్న సమయంలో ఫ్యాన్ వేగాన్ని పెంచారు.
    30 నిమిసాల తరువాత ఈ కారు బ్యాటరీ ఒక శాతం తగ్గింది. అంతే 61 శాతం నుంచి 60 శాతానికి వచ్చింది. ఇదే సమయంలో  ఈ  కారు మూడు నుంచి 4 కిలో మీటర్ల మైలేజ్ తగ్గింది. అంటే గంట పాటు ఇదే మోడ్ లో నడిపించడం వల్ల దాదాపు 9 కిలోమీటర్ల మైలేజ్ తక్కువగా  నమోదైనట్లు గుర్తించారు.
    ఇదే కంపెనీకి చెందిన మరో ఈవీ నెక్సాన్ ను ఈ విధంగానే గుర్తించారు. అయితే నెక్సాన్ లో 40.5 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ  75 శాతం నుంచి 74 కు వచ్చింది. అంటే ఇందులోనూ ఒక శాతం తగ్గింది. ఈ కారులో ఏసీ ఆన్ చేసి డ్రైవ్ చేయడం వల్ల 3 కిలోమీటర్ల మైలేజ్ తగ్గింది. ఈ రెండు కార్లలో ఒకే విధంగా మైలేజ్ తగ్గుతుండడంతో ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజ్ కామన్ గా తగ్గుతుందని గుర్తించారు.