RRR Movie Review: తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు.
దర్శకత్వం : ఎస్. ఎస్. రాజమౌళి,
ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్
కూర్పు : శ్రీకర్ ప్రసాద్
సంగీతం, నేపధ్య సంగీతం: ఎం. ఎం. కీరవాణి,
నిర్మాత : డి.వి.వి దానయ్య.
భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
Also Read: RRR Movie Special Story: స్పెషల్ స్టోరీ ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ ఎలా మొదలైంది?
కథ :
గోండు పిల్ల మల్లికను బ్రిటిష్ దొర, దొరసాని బలవంతంగా తీసుకువెళ్తారు. తన గోండు జాతి కోసం ప్రాణం ఇచ్చే కొమురం భీమ్ (ఎన్టీఆర్) తమ గూడెం పిల్ల కోసం ఢిల్లీలో అడుగుపెడతాడు. అత్తర్ (ఎన్టీఆర్)గా వేషం మార్చుకుని మల్లిక కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో కొమురం భీం (ఎన్టీఆర్) సంగతి తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం.. అతన్ని పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది. రామరాజు (చరణ్) తన లక్ష్యం కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇలా భీమ్ – కొమురం భీమ్ ఎవరి లక్ష్యాల వైపు వాళ్ళు సాగుతూనే.. ఇద్దరు ప్రాణ స్నేహతులుగా మారతారు. ఈ మధ్యలో జెన్నీ ( ఒలీవియా)కి దగ్గర కావడానికి భీమ్ చేసే ప్రయత్నాలకు రామరాజు (చరణ్) సాయం చేస్తుంటాడు.
అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ఒకరి పై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తోంది.
అసలు రామరాజు లక్ష్యం ఏమిటి ? భీమ్ ఎందుకు జెన్నీ చుట్టూ తిరుగుతాడు ? భీమ్ ను అనుకోకుండా కలుసుకున్న సీత (అలియా భట్) రామరాజు గతం గురించి ఏమి చెపుతుంది ? చివరకు బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఎలాంటి పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
అద్భుతమైన యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో పవర్ ఫుల్ ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రాజమౌళి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్, చరణ్ ల నటన హృదయాలను హత్తుకుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇద్దరి ఐడియాలజీ పూర్తిగా వేరు అయినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా బాగా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన పరిపక్వతమైన నటనతో అబ్బురపరిచాడు. చరణ్ ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది.
మెయిన్ గా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు సీక్వెన్స్ అయితే వండర్ ఫుల్ గా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పోటీ పడి మరీ కష్టపడ్డారు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్స్ గా నటించిన అలియా భట్, ఒలీవియా మోరిస్ తమ నటనతో ఎమోషనల్ సీన్స్ తో మెప్పించారు.
దర్శకుడు రాజమౌళి ఒక పాత్రకి మరో పాత్రకు మధ్య మంచి వైవిధ్యాన్ని చూపించాడు. అలాగే ప్రతి పాత్రను కథలో కలిసిపోయేలా ప్లే రాసుకోవటం కూడా బాగా ఆకట్టకుంది. కానీ, అలియా భట్ – చరణ్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదు. ఎన్టీఆర్ – చరణ్ రెగ్యులర్ మాస్ ను ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేసి వెళ్ళినా నిరాశ కలుగుతుంది. పైగా ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత విషయం సెకెండ్ హాఫ్ లో లేదు. కొన్ని సీన్స్ కూడా స్లోగా సాగుతాయి.
ప్లస్ పాయింట్స్ :
ఎన్టీఆర్ – చరణ్ నట విశ్వరూపం,
కథ కథనాలు, డైలాగ్స్,
ఎమోషనల్ సీన్స్,
రాజమౌళి స్క్రీన్ ప్లే.
సాంగ్స్,
విజువల్స్ అండ్ ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
చరణ్ – అలియా లవ్ ట్రాక్,
సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్,
చిన్న పాయింట్ బేస్ చేసుకుని మొత్తం కథ సాగడం,
చివరగా :
ఈ విజువల్ ఎమోషనల్ క్లాసిక్ డ్రామాలో.. ఇటు ఎన్టీఆర్, అటు చరణ్ ఇద్దరు అల్టిమేట్ యాటిట్యూడ్ తో యాక్టింగ్ తో దుమ్ము దులిపేశారు. అభిమానులకు ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్స్, ఎమోషన్స్, మరియు సాంగ్స్ ఇలా ప్రతిదీ ఆకట్టుకుంది. ఒక్కమాటలో ఆర్ఆర్ఆర్ ఎమోషనల్ యాక్షన్ విజువల్ ట్రీట్ కి ఒక ఫీస్ట్ లాంటిది.
రేటింగ్ : 4. 2 / 5
Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !