RRR Movie Top Media Rating: అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైంది. ఇద్దరు అగ్ర స్టార్ హీరోలు చేసిన ఈ మూవీని తెలుగు నాట , దేశం మొత్తం, ఓవర్సీస్ లో చూసి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకొని సినిమా ముందుకెళుతోంది.

సాధారణ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది. కాస్త ఎంటర్ టైన్ మెంట్ ఆశించే వారికి కూడా సినిమా పండుగలా ఉంటుంది. అయితే క్రిటిక్ కోణంలో చూసి రివ్యూ చేసినప్పుడే ఆ సినిమా అసలు సక్సెస్ నా? కాదా? అన్నది తేలింది.
Also Read: Naatu Naatu Song Copied: ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్స్ జక్కన్న అక్కడ నుంచి తీసుకున్నారా ?
ఇప్పటికీ ఓవర్సీస్ సహా అనేక విదేశాల్లో చాలా మంది ప్రవాస భారతీయులు రివ్యూ రేటింగ్ లు చూసి సినిమాలకు వెళుతుంటారు. రేటింగ్ 3 దాటితేనే అమెరికాలో సినిమా చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి విలువైన సమయాన్ని డబ్బును వెచ్చించి సేదతీరేందుకు చూసే సినిమా విషయంలో వాళ్లు ముందుగానే పాపులర్ మీడియాలో ప్రచురితమయ్యే రివ్యూలు చదివి మూవీకి వెళుతారు.
ఇక ఇండియాలో మౌత్ టాక్ ను బట్టి ఎక్కువగా సినిమాలకు వెళతారు. రివ్యూలను కొందరు చూస్తారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన నేపథ్యంలో సినిమాను సినిమాగా చూసే క్రిటిక్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. మెజార్టీ సినిమా బాగుందని అభిప్రాయపడగా.. కొందరు అందులో లూప్ హోల్స్ వెతికారు. దేశంలోని పాపులర్ మీడియా చానెల్స్ ఏ రేటింగ్ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం.

-ఆర్ఆర్ఆర్ కు దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల రివ్యూలు
-ఇండియన్ ఎక్స్ ప్రెస్: 3.5/5
-NDTV : 2/5
-టైమ్స్ ఆఫ్ ఇండియా : 3.5/5
-ది న్యూస్ మినిట్: 3.5/5
-న్యూస్ 18: 3.5/5
-ఐఎండీబీ రేటింగ్: 9.2/10
-రిపబ్లిక్ టీవీ 3/5
*——————————
-తెలుగు మీడియా లో రేటింగ్ చూస్తే…
okteulugu.com రేటింగ్ : 4.2/5
-గ్రేట్ ఆంధ్రా. కామ్: 2.5/5
-తుపాకీ.కామ్ 3/5
-ఫిల్మీబీట్/వన్ ఇండియా : 3.5/5
123తెలుగు: 3.5/5
సాక్షి: 3.25/5
-తెలుగు360: 3.5 /5
-ఆసియా నెట్ న్యూస్ : 3.5
-నమస్తే తెలంగాణ: 3/5
-గుల్టే : 3.25/5
-టీవీ9 : యావరేజ్