ss rajamouli next movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తను మరో మల్టీస్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ ఇద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ప్రభాస్ తో చత్రపతి, బాహుబలి సినిమాలను చేసినప్పటికి అల్లు అర్జున్ తో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
దాంతో వీళ్ళిద్దరినీ కలిపి ఒక పాన్ వరల్డ్ లో భారీ మల్టీ స్టారర్ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కలిపిన రాజమౌళి ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందనుకుంటే భారీ విజయాన్నైతే సాధించలేక పోయింది.
దాంతో ఎలాగైనా సరే మరో ఇద్దరు స్టార్ హీరోలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రభాస్, అల్లు అర్జున్ లను ఎంచుకున్నట్టుగా రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ అయితే ఒక హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే తను కథానైతే రెడీ చేసి పెట్టాడట.
మరి ఈ సినిమాలో వీళ్లిద్దరిని హీరోగా ఫిక్స్ చేస్తాడా? లేదంటే ఫైనల్ గా ఇంకెవరైనా హీరోలతో ముందుకు సాగే ఆలోచనలు ఉన్నాయా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… వారణాసి సక్సెస్ ను బట్టి రాజమౌళి ఈ సినిమాను ఎవరితో తెరకెక్కించాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…