Varanasi Movie Budget : దర్శకధీరుడిగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఎంచుకుంటాడు. ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప విజయాలను సాధించడమే కాకుండా ఆయన పేరు ప్రఖ్యాతలను యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే తాను చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో ఒక ఫైట్ ను దాదాపు 25 కోట్లు పెట్టి చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు దాటుతుందని అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరోసారి పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పిస్తాడంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి.
తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని తెరకెక్కిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానటువంటి గొప్ప విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాను చాలా ప్రెస్టేజీయస్ ఇష్యూతో తెరకెక్కిస్తున్నాడు.
ఎందుకంటే హాలీవుడ్ డైరెక్టర్లకు సైతం పోటీని ఇచ్చే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్న రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే మహేష్ బాబు లుక్కుతో పాటు గా విలన్ గా చేస్తున్న ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రా లుక్కులను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. దాన్ని తట్టుకొని ఈ సినిమా నిలబడగలుగుతుందా? 2027 వ సంవత్సరంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని రాజమౌళి తన మాట మీద నిలబడి సినిమాను అనుకున్న టైమ్ కు ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే ఈ సినిమా తెలుగు సినిమా స్థాయి ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…