SSMB29 Priyanka Chopra First Look: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరెకక్కుతున్న #GlobeTrotter చిత్రం నుండి రోజుకో అప్డేట్ వస్తూనే ఉంది. రీసెంట్ గానే ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఈ ఫస్ట్ లుక్ మీద వచ్చినన్ని ఫన్నీ ట్రోల్స్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా రాలేదు. ఇక నిన్న గాక మొన్న విడుదలైన థీమ్ సాంగ్ ‘సంచారి’ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక నేడు ఈ సినిమా నుండి ప్రియాంక చోప్రా(Priyanka Chopra Jonas) ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read: నిరాశపరుస్తున్న ‘అఖండ 2’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..5 మిలియన్ గ్రాస్ టార్గెట్..వచ్చింది ఎంతంటే!
పసుపు చీర కట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని కాలుస్తూ, చాలా పవర్ ఫుల్ గా కనిపించింది ప్రియాంక చోప్రా. ఇందులో అందరూ ఆమెది స్టైలిష్ రోల్ అని అనుకున్నారు కానీ, ఇలా ఒక్కసారి గా చీరలో కనిపించేలోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురి అయ్యారు. ఇంతకీ ఈ చిత్రం లో ఈము పాజిటివ్ క్యారక్టర్ చేస్తుందా?, లేదా నెగిటివ్ క్యారక్టర్ చేస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. నిన్న మొన్నటి వరకు ఈమె విలన్ క్యారక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పద్దతిగా చీర కట్టులో కనిపించిన ప్రియాంక చోప్రా ఎందుకు వీరోచితంగా పోరాడుతూ గన్ కాలుస్తోంది?, సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరి ఈమె క్యారక్టర్ పై పూర్తిగా అవగాహన రావాలంటే కచ్చితంగా ఈ నెల 15 వరకు ఆగాల్సిందే. 15 వ తేదీన జరగబోయే ఈవెంట్ మాత్రం అభిమానులకు, మూవీ లవర్స్ కి మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఈవెంట్ ని మొదట లక్ష మందితో చెయ్యాలని అనుకున్నారు కానీ, పోలీసులు అంతకు అనుమతించకపోవడం తో 50 వేల మంది అభిమానులతో సరిపెడుతున్నారు. 15 న మూడు నిమిషాల నిడివి ఉన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. చూడాలి మరి ఈ గ్లింప్స్ ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు పెంచబోతోంది అనేది.
The woman who redefined Indian Cinema on the global stage. Welcome back, Desi Girl! @priyankachopra
Can’t wait for the world to witness your myriad shades of MANDAKINI.#GlobeTrotter pic.twitter.com/br4APC6Tb1
— rajamouli ss (@ssrajamouli) November 12, 2025