Operation Sindoor 2.0: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత సోమవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది భారతీయులు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరంతా కూడా ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. వారందరినీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు.. భూటాన్ పర్యటన నుంచి స్వదేశానికి వచ్చిన ఆయన నేరుగా బాంబు పేలుడు క్షతగాత్రులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మాటలు మాట్లాడిన వెంటనే జమ్ము కాశ్మీర్ లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇండియన్ ఆర్మీ జమ్ము కాశ్మీర్లోని సుమారు 300 ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్లు మొదలుపెట్టింది. అంతేకాదు జమాత్ ఈ ఇస్లామి అనే ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల గృహాలలో తనిఖీలు చేసిన ఆర్మీ అధికారులు.. ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని.. ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరిని కూడా అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణలో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆర్మీ అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తుల బ్యాంకు ఖాతాలు.. వాడుతున్న ఫోన్ నెంబర్లు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారు.. అనే విషయాలను ఆర్మీ అధికారులు సేకరించారని తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇండియన్ ఆర్మీ ఇలానే చేసింది.. అత్యంత ఖచ్చితమైన ఆధారాలతో ఆపరేషన్ చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది.. కేవలం ఉగ్రవాదులు మాత్రమే నష్టపోయే విధంగా కూల్చివేతలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు కూడా భారత ఆర్మీ అప్పటి మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ 2.0 మొదలైందని.. ఉగ్రవాద దేశంపై దాడి షురూ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భూటాన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులకు సూటిగా.. స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆయన స్వదేశానికి రాగానే పరిస్థితి మారిపోయింది. ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని జల్లెడ పడుతోంది. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి వదిలేస్తోంది. అంతేకాదు సున్నితమైన ప్రాంతాలలో నిఘా ను మరింత పటిష్టం చేసింది.
Indian Army – "Please ask your terrorist son to surrender."
Family – "No, he will not surrender. If he comes home alive then we will k!ll him."
— Kreately.in (@KreatelyMedia) November 11, 2025