Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రాజమౌళి (Rajamouli) ఏ సినిమా చేసిన కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక రాబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాడనే నమ్మకం అయితే అందరిలో ఉంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రోజుకు ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇంతకీ ఆ డైలాగు ఏంటంటే నిధి వేటలో మహేష్ బాబు ఉన్నప్పుడు అతన్ని పట్టుకోడానికి కొంతమంది రౌడీలు వస్తారు.
అప్పుడు మహేష్ బాబు ఆ రౌడీలను ఉద్దేశిస్తూ ‘ఆ నిధిని టచ్ చేయాలంటే గుండెల్లో గట్స్ ఉండాలి అది మీలో ఎవరి దగ్గర లేదని నాకు తెలుసు ‘ అంటూ ఆయన ఒక డైలాగ్ అయితే చెబుతాడట…మరి ఈ డైలాగు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే రాజమౌళి కావాలనే ఈ డైలాగ్ ను రిలీజ్ చేశారు అంటూ కొంతమంది అంటుంటే ఇది ఫ్యాన్ మేడ్ గా కొంతమంది ఫ్యాన్స్ క్రియేట్ చేసి డైలాగ్ ను రిలీజ్ చేశారు అంటూ ఇంకొంత మంది కామెంట్స్ చేస్తు ఉండటం విశేషం…
ఈ సినిమా నుంచి ఇది అఫీషియల్ గా రానందువల్ల ఈ డైలాగు ఎవరు రిలీజ్ చేశారు అనే దానిమీద క్లారిటీ అయితే లేకుండా పోయింది. మొత్తానికైతే డైలాగ్ ను విన్న మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలో ఎలాంటి డైలాగులైతే చెప్పాడో ఈ సినిమాలో కూడా అలాంటి తరహా డైలాగులను వాడబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి తన స్టాండర్డ్ ని పాన్ వరల్డ్ రేంజ్ కి పెంచి సినిమాని ముందుకు తీసుకెళ్తున్న నేపధ్యంలో భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…