https://oktelugu.com/

Sruthi Haasan: బాలయ్య తో మూవీ కోసం శృతి హాసన్ ఎంత తీసుకుంటుందో తెలుసా ?

Sruthi Haasan: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. ఓ వైపు సినిమాలు మరో వైపు ఓటిటీ లో టాక్ షో చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేసిన బాలయ్య… దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హీరోగా బాలకృష్ణకు ఇది 107వ సినిమా కావడం విశేషం. కాగా ఇందులో హీరోయిన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 20, 2021 / 10:08 AM IST
    Follow us on

    Sruthi Haasan: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. ఓ వైపు సినిమాలు మరో వైపు ఓటిటీ లో టాక్ షో చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేసిన బాలయ్య… దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హీరోగా బాలకృష్ణకు ఇది 107వ సినిమా కావడం విశేషం. కాగా ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. నిజానికి కెరీర్ పరంగా చాలా బిజీగానే ఉంది శృతి హాసన్. ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తోంది. ఇలాంటి సమయంలో సీనియర్ హీరో బాలయ్యకు జోడీగా నటించడానికి ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

    అయితే దానికి కారణం దర్శకుడు గోపీచంద్ మలినేని అని తెలుస్తోంది. అంతకు ముందు గోపిచంద్ డైరెక్షన్ లో వచ్చిన ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాల్లో శృతి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మరోసారి తన సినిమాలో నటించమని అడగడంతో శృతి కాదనలేకపోయింది అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కానీ ఈ సినిమా రెమ్యునరేషన్ గా రెండు కోట్లు డిమాండ్ చేసిందంట శృతి. ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకోవడంతో ఆమె అగ్రిమెంట్ పై సైన్ చేసిందని అనుకుంటున్నారు.

    మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు గోపిచంద్ మలినేని. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.