Arjun Srisatya Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో యంగ్ బ్యూటిఫుల్ లేడీ ఎవరంటే ఫస్ట్ శ్రీసత్య పేరు చెబుతారు. ఈ సారి హౌస్లో గ్లామర్ డోస్ తగ్గింది. ఉన్నోళ్లలో శ్రీసత్య టాప్ అని చెప్పాలి. దీంతో అర్జున్ కళ్యాణ్ డే వన్ నుండే ఆమెను బుట్టలో వేసుకోవడానికి ట్రై చేశాడు. ఆమె సేవల్లో తరించాడు. శ్రీసత్యను ఇంప్రెస్ చేయడం కోసం అర్జున్ చేయని ప్రయత్నం లేదు. ఆమె కోసం గేమ్ వదిలేశాడన్న విమర్శలు ఎదుర్కొన్న అర్జున్ కళ్యాణ్ కొన్ని శిక్షలకు గురయ్యారు. చివరకు 7వ వారం ఎలిమినేటై బయటకు వచ్చేశాడు.

అర్జున్ ఎలిమినేషన్ కి శ్రీసత్య కూడా ఒక కారణమన్న వాదన ఉంది.ఇక అర్జున్ ఎలిమినేషన్ రోజు శ్రీసత్య కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీసత్య ఏడవడం చూసి నాగార్జునతో పాటు వేదికపై ఉన్న అర్జున్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. నువ్వు బాగా ఆడు. బయట విషయాలు నేను చూసుకుంటా, మీ పేరెంట్స్ ని కలుస్తా అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు. దీంతో అర్జున్ కళ్యాణ్-శ్రీసత్య మధ్య ఏదో ఉందన్న వాదన మొదలైంది.
కాగా శ్రీసత్య-అర్జున్ కళ్యాణ్ రిలేషన్ పై శ్రీసత్య ఫాదర్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీసత్య తండ్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీసత్యకు అర్జున్ కళ్యాణ్ కేవలం ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించి వాళ్ళ మధ్య ఏమీ లేదు అన్నారు. వృత్తి రీత్యా హౌస్లోకి వెళ్లక ముందే పరిచయం ఉంది. వారిద్దరి స్నేహాన్ని తప్పుగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి అన్నారు.
అర్జున్ కళ్యాణ్ హౌస్లో శ్రీసత్య అంటే క్రష్ అని చెప్పాడు, దీనికి ఏమంటారని అడుగగా… అర్జున్ కళ్యాణ్ ట్రై చేసిన మాట వాస్తవమే. అయితే నా కూతురు జెన్యూన్. అందరితో ఒకే విధమైన రాపో మైంటైన్ చేసింది. అర్జున్ కి నేను అలా కాదు, ఊహించుకోవద్దని కూడా చెప్పింది. శ్రీసత్య అందమైన అమ్మాయి. ఒక అందమైన అమ్మాయిని భార్యగా తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అర్జున్ కళ్యాణ్ కూడా కోరుకొని ఉండవచ్చు. హౌస్ నుండి బయటకు వచ్చాక అతడి ఇంటర్వ్యూలు నేను చూశాను. శ్రీసత్య కేవలం ఫ్రెండ్ అని చెప్పాడు. నా కూతురిపై నాకు నమ్మకం ఉంది. బయటవాళ్ళ కామెంట్స్ పట్టించుకోను అని ఆయన చెప్పుకొచ్చారు.