Bigg Boss 6 Telugu- Sri Satya: బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం పూర్తి చేసుకోనుంది. వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున రంగంలోకి దిగాడు. ఈ వారం హౌస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో ఇంటి సభ్యుల పట్ల ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఏకంగా కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠిన పరీక్షలు పెట్టాడు. ఫుడ్ లేకుండా కడుపు మాడ్చాడు. అలాగే సర్వైవల్ టాస్క్ పేరుతో ఇంటి సభ్యుల మధ్య మంట పెట్టాడు. ఇలా వీక్ మొత్తం కొంచెం సీరియస్ గా సాగింది.

ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించిన బిగ్ బాస్ సర్వైవల్ టాస్క్ ఆడించారు. చిన్న రంధ్రం నుండి పూలు, బొమ్మలు వస్తూ ఉంటాయి. ఇరు టీమ్స్ సభ్యులు వాటిని సేకరించాలి. ఎక్కువ సేకరించిన టీం విన్ అవుతుంది. ఈ గేమ్ లో శ్రీసత్య టీమ్ ఓడిపోయింది. ఓడిపోయిన టీం సభ్యుల నుండి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు. అది ఎవరనేది ఆ టీం సభ్యులు నిర్ణయించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అందరూ బాగా ఆడారు, ఒకరిని కార్నర్ చేయడం ఎందుకని చెప్పిన శ్రీసత్య చిట్టీలు రాసి, ఎవరి పేరు వస్తే వాళ్ళు నామినేట్ అయినట్లని చెప్పింది.
టీం సభ్యుల పేర్లు చిట్టీలలో రాసి జాడీలో వేశారు. మరో టీం కి చెందిన ఫైమాను పిలిచి ఒక చిట్టీ తీయమనగా… ఫైమా తీసిన చిట్టీలో శ్రీసత్య పేరు రాసి ఉంది. దాంతో ఆమె నేరుగా నామినేట్ అయ్యారు. అయితే శ్రీసత్య చిట్టీల గేమ్ రద్దు చేసి మరలా నామినేషన్స్ నిర్వహించింది. ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలంది. అప్పుడు అధిక ఓట్లు వాసంతికి రాగా ఆమె నామినేట్ అయ్యింది.

ఈ విషయాన్ని నాగార్జున అడిగారు. చిట్టీలు ఆడినప్పుడు శ్రీసత్య పేరు వచ్చింది. దాన్ని రద్దు చేసిన మళ్ళీ నామినేషన్స్ పెట్టడం కరెక్ట్ గా ఫీల్ అయ్యారా? అని అడిగాడు. దానికి శ్రీసత్య వివరణ ఇచ్చింది. మేము ఎంటర్టైన్మెంట్ టాస్క్ సరిగా ఆడలేదు. ఈ వారం మీరు బాగా తిడతారని డిసైడ్ అయ్యాము. అందుకే చిట్టీలతో నామినేషన్ నిర్ణయిస్తే ఏమంటారో అని, మార్చాను సార్ అని చెప్పింది. దానికి నాగార్జున అయితే నేరం నా మీదకు నెట్టేశారా? అని ఆశ్చర్యపోయాడు. ఇక ఈ వారం మొత్తం 13 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరు హౌస్ వీడుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.