Srinivas Avasarala: అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఎందుకా దర్శకుడు సినిమాలు తీయడం లేదు? యాక్టింగ్ వైపు వెళ్లిపోయాడా? ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు తీసుకొని అటువైపే సెటిల్ అయిపోతాడా?, నిజానికి ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాని కరోనాకి ముందు తీశాడు. ఆ తర్వాత రవితేజతో సినిమా ప్లాన్ చేశాడు.

మరి అవసరాల శ్రీనివాస్, రవితేజతో తీయాల్సిన సినిమా ఏమైంది ? ఈ ప్రశ్నలన్నింటికీ అవసరాల శ్రీనివాస్ సమాధానం ఇచ్చాడు. “హీరో రవితేజతో సినిమా చేయాల్సి ఉంది. కాస్త ఆలస్యం అయ్యింది. కాస్త కాదు, బాగా ఆలస్యమైపోయింది. వచ్చే ఏడాది తప్పకుండా చేస్తాను. 2023లో కచ్చితంగా నా సినిమా స్టార్ట్ అవుతుంది’ అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చేసిన సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి
అవసరాల శ్రీనివాస్ ఇలా రవితేజతో తన నెక్ట్స్ సినిమా తప్పకుండా ఉంటుందని ప్రకటించాడు. మరి ఈ గ్యాప్ లో ఏం చేయబోతున్నాడు? దీనికి కూడా అవసరాల శ్రీనివాస్ వద్ద సమాధానం ఉంది. తను ఖాళీగా లేనంటున్నాడు ఈ దర్శకుడు కమ్ నటుడు. “నటుడిగా ఓ క్రైమ్ కామెడీ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. వెంటనే సెట్స్ పైకి వచ్చేది అదే అని చెబుతున్నాడు.

ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా అవసరాల శ్రీనివాస్ చేయబోతున్నాడట. దీని గురించి అవసరాల మాట్లాడుతూ.. ‘అది నా డ్రీమ్ ప్రాజెక్టు లాంటిది. వీటితో పాటు దర్శకుడు క్రిష్ గారితో కూడా ఓ మంచి స్క్రిప్ట్ డిస్కషన్ జరిగింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నేను హీరోగా ఆ సినిమా వస్తుంది’ అని అవసరాల క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి ఇకపై తన నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయంటున్నాడు అవసరాల శ్రీనివాస్. ఓ వైపు నటిస్తూనే, మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ డైరక్ట్ చేస్తానని చెబుతున్నాడు.
Also Read:Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్