Gopichand Pakka Commercial: గోపీచంద్ మార్కెట్ పై ప్రస్తుతం చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ హీరోకి అయినా మార్కెట్ లో విలువ ఉండాలంటే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగా రావాలి. ఒక హీరో సినిమాకి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటే అతనికి క్రేజ్ లేనట్లే. హీరో గోపీచంద్ ఇప్పుడే అదే సమస్య ఫేస్ చేస్తున్నాడు. ఆయన నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీన రిలీజ్ కి సిద్ధం అయ్యింది. అయితే.. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించినా.. భారీ స్థాయిలో అయితే అమ్ముడుపోవడం లేదు.

గోపీచంద్ రీసెంట్ చిత్రాలు ఏవి డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టలేదు. గోపీచంద్ కి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే సత్తా తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే హీరోగా గోపీచంద్ కి ఇప్పుడు ఏమి క్రేజ్ లేదు. గోపీచంద్ లో రెగ్యులర్ హీరో లక్షణాలు లేవు అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గోపీచంద్ కి ఇంటెన్స్ పాత్రలు బాగా సూట్ అవుతాయి.
Also Read: Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్
కానీ, గోపీచంద్ మాత్రం మాస్ హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా సక్సెస్ పైనే గోపీచంద్ సినీ కెరీర్ ఆధార పడి ఉంది. ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయితే.. ఇకపై గోపీచంద్ ని హీరోగా చూసేందుకు జనం ఆసక్తి చూపుతారా అంటే డౌటే. ప్రస్తుతానికి ఐతే గోపీచంద్ మార్కెట్ ఆల్మోస్ట్ చిన్న హీరో స్థాయికి పడిపోయింది. ‘పక్కా కమర్షియల్’ సినిమా హిట్ అయితే.. గోపీచంద్ కి మళ్లీ మార్కెట్ పెరుగుతుంది.

ఈ సినిమాలో గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సహజంగా మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి సినిమా వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు.
Also Read:Gopichand: గోపీచంద్ కీలక నిర్ణయం.. వర్కౌట్ అవుతుందా ?