Sreeleela: సోషల్ మీడియాను శ్రీలీల లిప్ కిస్ సీన్ ఊపేస్తోంది. ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ నేపథ్యంలో అడ్డంగా బుక్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. విషయంలోకి వెళితే… శ్రీలీల లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. శ్రీలీల కీలక రోల్ చేసిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హిట్ దిశగా దూసుకువెళుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో శ్రీలీలకు ఓ క్రేజీ క్వచ్చన్ ఎదురైంది.
లిప్ లాక్ సన్నివేశాల మీద నీ అభిప్రాయం ఏమిటీ? లిప్ కిస్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తావు? అని అడిగారు. శ్రీలీల కొంచెం తెలివైన సమాధానం చెప్పింది. సిల్వర్ స్క్రీన్ మీద నేను లిప్ లాక్ సన్నివేశాలు చేయను. లిప్ కిస్ ఇవ్వాల్సి వస్తే నా మొదటి కిస్ నా భర్తకే అని చెప్పింది. అయితే ఈ సోషల్ మీడియాలో యుగంలో ఒక మాట అనే ముందు అన్నీ చెక్ చేసుకోవాలి. శ్రీలీల గతంలో లిప్ లాక్ సీన్ చేసిన విషయం మర్చిపోయింది ఈ కామెంట్ చేసింది.
దీంతో జనాలు ఆమె లిప్ లాక్ వీడియో బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. భర్తకే లిప్ కిస్ అన్నావు. మరి ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. శ్రీలీల డెబ్యూ మూవీ ‘కిస్’. ఈ కన్నడ చిత్రంలో విరాట్ హీరో. అతడిలో ఓ ఘాటైన లిప్ లాక్ సీన్లో శ్రీలీల నటించింది. అది మరచి అసలు ఇంత వరకు లిప్ లాక్ సీన్ చేయనట్లు శ్రీలీల మాట్లాడింది. ఆ వీడియో బయటకు రావడంతో అడ్డంగా బుక్ అయ్యింది. కిస్ మూవీలోని ఆ సీన్ తెగ వైరల్ అవుతుంది.
ఈ గోల అటుంచితే… శ్రీలీల టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా అవతరించింది. అరడజను చిత్రాల వరకూ ఆమె చేతిలో ఉన్నాయి. గుంటూరు కారంలో మహేష్ బాబు పక్కన, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తో జతకడుతుంది. అలాగే విజయ్ దేవరకొండతో ఒక చిత్రం. ఆదికేశవ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటిస్తుంది.
Nenu Lip Lock Scenes lo act Cheyanu Oka Vela Cheyalsi Vasta na Husband Ki Chesta
:- #Sreeleela
Meanwhile pic.twitter.com/wIPJmGr3xY
— Milagro Movies (@MilagroMovies) October 27, 2023