https://oktelugu.com/

Vinesh Phogat: ఇంత వేదన మనసులో దాచుకుందా? గుండెను మెలిపెడుతున్న వినేశ్ ఫొగాట్ పోస్ట్.. కన్నీరు మున్నీరవుతున్న అభిమానులు..

కాస్ లో చుక్కెదురైన నేపథ్యంలో వినేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన కెరియర్, శిక్షకుడు వోలర్ ఎకోస్, భారత ఒలంపిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పార్దివాలా స్పందించింది. ఇదే సమయంలో తన కుటుంబంపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 17, 2024 / 08:59 PM IST

    Vinesh Phogat

    Follow us on

    Vinesh Phogat: పారిస్ ఒలంపిక్స్ లో వినేశ్ ఫొగాట్ వెంట్రుక వాసిలో మెడల్ కోల్పోయింది. దీనిపై దేశం యావత్తు శోకసంద్రమైంది. ఆమెకు అండగా నిలిచింది. కష్టకాలంలో భరోసా ఇచ్చింది. నువ్వు మెడల్ సాధించకపోయినా.. మా బంగారు కొండవంటూ కితాబిచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్ ఫొగాట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అది కాస్త ఒక్కసారిగా విస్తృతమైన వ్యాప్తిలోకి వచ్చింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు గుండె బరువెక్కిపోయిందని.. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి వేదనను గుండెలో ఎలా దాచుకున్నావని ఆమెను ప్రశ్నిస్తున్నారు.

    కాస్ లో చుక్కెదురైన నేపథ్యంలో వినేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన కెరియర్, శిక్షకుడు వోలర్ ఎకోస్, భారత ఒలంపిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పార్దివాలా స్పందించింది. ఇదే సమయంలో తన కుటుంబంపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.

    వినేశ్ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చింది. అలాంటి యువతి ఒలంపిక్స్ రింగ్ లో అడుగు పెట్టింది. పెద్ద జడతో, చేతిలో మొబైల్స్ తో జీవితాన్ని గడపాలని ఆమెకు ఉండేది. వినేశ్ తండ్రి బస్ డ్రైవర్. అతడు మాత్రం తన కూతురు విమానంలో ఎగురుతుంటే.. దాని కింద బస్సు నడపాలని కోరుకునేవాడు. దానిని నిజం చేసింది వినేశ్. అయితే ఈ విషయాన్ని ఆమె ఎవరికి బయటికి చెప్పలేదు. వినేశ్ కు ఇద్దరు సోదరీమణులు. అయితే వారందరిలో వినేశ్ అంటేనే ఆమె తండ్రికి ఇష్టం. ఆమె చెప్పే చిన్న చిన్న మాటల్ని నవ్వుతూ వినేవాడు. ఆమెకు గొప్ప గొప్ప కథలు చెప్పేవాడు.

    ఇలా సాగిపోతున్న వారి సంసారంలో ఒకసారిగా పెను ఉత్పాతం సంభవించింది. వినేశ్ తండ్రి కన్నుమూశాడు. దీంతో కొంతకాలం విమానం ఎకాలని ఆలోచనను వినేశ్ పక్కన పెట్టింది. కొంతకాలం వారి సంసారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ క్రమంలో వినేశ్ తలి కూడా క్యాన్సర్ బారిన పడింది. మూడో దశ కావడంతో వినేశ్ తీవ్రంగా భయపడింది. ఇదే సమయంలో ముగ్గురు కూతుర్లతో వినేశ్ తల్లి ప్రయాణం కొనసాగింది. ఆమెకున్న చిన్న చిన్న కోరికలు వెనక్కి వెళ్ళాయి. ఇదే క్రమంలో వినేశ్ తల్లి చెప్పిన మాటలు ఆమెలో స్ఫూర్తిని నింపాయి. అందువల్లే వినేశ్ రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అన్యాయాలపై గళం ఎత్తింది. వీధిలోకి వెళ్లి పోరాటాలు చేసింది. వేగంగా ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. వినేశ్ కు ఆమె భర్త సోమ్ వీర్ అన్ని వేళల్లో అండగా నిలిచాడు. ఆమెకు సంపూర్ణ మద్దతు ఇచ్చాడు. ఆమె సాధించిన ప్రతి విజయం వెనుక అతడు త్యాగం ఉంది. ఆమె ప్రయాణాన్ని తన ప్రయాణం లాగానే భావించాడు. అందువల్లే వినేశ్ ఈ స్థాయికి చేరుకుంది. లేకుంటే ఆమె చాలా ఇబ్బందులు పడేది. అందువల్లే అతడిని తన భర్త కంటే.. తన జీవితంలోకి ప్రవేశించిన గొప్ప స్నేహితుడిగా వినేశ్ భావిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పింది.