https://oktelugu.com/

Srileela : సినిమాలకు బ్రేక్… శ్రీలీల కీలక నిర్ణయం!

అమెరికాలో పుట్టిన శ్రీలీల తల్లి విడాకులు తీసుకోవడంతో ఇండియా వచ్చింది. తల్లితో పాటు బెంగుళూరులో ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 04:29 PM IST
    Follow us on

    Srileela : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా అవతరించింది శ్రీలీల. ఈ కన్నడ భామ పెళ్లి సందD మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. మొదటి చిత్రంతోనే ఆకర్షించింది. ధమాకా హిట్ తో ధూమ్ ధామ్ చేసింది. ధమాకా చిత్రంలో శ్రీలీల ఎనర్జీకి తెలుగు ఆడియన్స్ పడిపోయారు. ఆఫర్స్ ఉప్పెనలా వెల్లువెత్తాయి. మహేష్ బాబుకి జంటగా గుంటూరు కారం చిత్రం చేస్తున్న శ్రీలీల, నితిన్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్ అప్ కమింగ్ చిత్రాల్లో నటిస్తోంది.

    పవన్ కళ్యాణ్ కి జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం కలదట. పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే బాలకృష్ణ-కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీల కీలక రోల్ చేస్తుంది. అటు టాప్ హీరోలతో పాటు ఎటు టైర్ టూ హీరోలతో కూడా శ్రీలీల జతకడుతుంది.

    సినిమాల్లో తీరిక లేకుండా గడుపుతున్న శ్రీలీల షార్ట్ బ్రేక్ తీసుకున్నారని సమాచారం. శ్రీలీల మెడిసిన్ స్టూడెంట్. బెంగుళూరులో ఎంబిబిఎస్ చదువుతుంది. ఆమె ఇప్పుడు చివరి ఏడాదిలో ఉన్నారు. పరీక్షలు దగ్గరపడిన నేపథ్యంలో ప్రిపేర్ కావాలని నిర్ణయం తీసుకుందట. అందుకు గానూ తన నిర్మాతలను రిక్వెస్ట్ చేసి గ్యాప్ తీసుకుందట. పరీక్షలు ముగిశాక తిరిగి షూటింగ్స్ కి హాజరవుతుందట.

    ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద సెప్టెంబర్ లో విడుదల కానుంది. భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల అవుతుంది. అమెరికాలో పుట్టిన శ్రీలీల తల్లి విడాకులు తీసుకోవడంతో ఇండియా వచ్చింది. తల్లితో పాటు బెంగుళూరులో ఉంటుంది. శ్రీలీల తల్లి కూడా డాక్టర్. చిన్నప్పటి నుండి శ్రీలీల డ్యాన్స్ నేర్చుకుంది.