https://oktelugu.com/

రొమాన్స్ చేసేటప్పుడు రోజా అన్నయ్య అనేదట !

నటుడు శ్రీకాంత్ ఎమ్మెల్యే రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెట్స్ లో రొమాన్స్ చేసేటప్పుడు రోజా ఎలా ప్రవర్తించేదో శ్రీకాంత్ తెలియజేశాడు. రామానాయుడు నిర్మాతగా 1999లో విడుదలైన ప్రేయసి రావే సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్-రాశి జంటగా నటుడు పృథ్విరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రం ఇటీవలే 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో హీరో శ్రీకాంత్ ఆ చిత్ర విశేషాలతో పాటు, అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రోజాతో తనకు గల […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 02:05 PM IST
    Follow us on


    నటుడు శ్రీకాంత్ ఎమ్మెల్యే రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెట్స్ లో రొమాన్స్ చేసేటప్పుడు రోజా ఎలా ప్రవర్తించేదో శ్రీకాంత్ తెలియజేశాడు. రామానాయుడు నిర్మాతగా 1999లో విడుదలైన ప్రేయసి రావే సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్-రాశి జంటగా నటుడు పృథ్విరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రం ఇటీవలే 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో హీరో శ్రీకాంత్ ఆ చిత్ర విశేషాలతో పాటు, అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ రోజాతో తనకు గల అనుబంధాన్ని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

    Also Read: వెంకీ, వరుణ్, తమన్నాల రెమ్యూరేషన్లు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    సెట్స్ లో రోజా… శ్రీకాంత్ ని అన్నయ్య అని పిలిచేవారట. ప్రతి సన్నివేశం చేసే ముందు అలా చేద్దాం, ఇలా చేద్దాం అన్నయ్య అని చర్చించేదట. చివరకు రొమాంటిక్ సన్నివేశాలలో నటించేటప్పుడు కూడా రోజా అన్నయ్య అంటుంటే శ్రీకాంత్ చిరాకు పడేవాడట. నువ్వు అలా పిలవకు రోజా, నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదు అనేవాడట. నవ్వుతూ అరుదైన అప్పటి క్షణాలు గుర్తు చేసుకున్నారు శ్రీకాంత్. రోజా, శ్రీకాంత్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా వంటి హిట్ చిత్రాలలో కలిసి నటించారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి అప్పట్లో సంచల హిట్ అందుకుంది. ఈ సినిమాలో బ్రహ్మనందం మరియు కోవై సరళ కామెడీ హైలెట్ గా నిలిచింది.

    Also Read: ఫెయిల్యూర్ డైరెక్టర్ కు మెగాస్టార్ అభినందనలు !

    అలాగే ప్రేయసి రావే మూవీలో నటించడం తన అదృష్టం అని శ్రీకాంత్ అన్నారు. రామానాయుడు గారు పట్టుబట్టి తనతో ప్రేయసి రావే మూవీ చేశారని, అందుకు ఆయనకు నా ధన్యవాదాలు అని శ్రీకాంత్ చెప్పారు. దర్శకుడు చంద్ర మహేష్ కి ఈ మూవీ డెబ్యూ చిత్రం కాగా, పోసాని కృష్ణమురళి మాటలు రాశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్