Nani angry on Srikanth Odela: దసర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ‘శ్రీకాంత్ ఓదెల’ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 150 కోట్లలో పూర్తవుతుందని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికే ఈ సినిమాకి 200 కోట్లకు పైన బడ్జెట్ అయింది. ఇంకో 15 రోజులపాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా ఫస్ట్ కాపీ వచ్చేసరికి ఈ బడ్జెట్ మరో 50 కోట్ల వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు దాటుతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ సైతం ఈ సినిమా విషయంలో కొంతవరకు కంగారు పడుతున్నారట. ఓవర్ బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఏదైనా తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజానికి శ్రీకాంత్ ఎందుకని ఇలా చేస్తున్నాడు. దసర సినిమాని సైతం 30 కోట్లలో పూర్తి చేస్తానని చెప్పి దానిని 60 కోట్ల బడ్జెట్ కి తీసుకెళ్లాడు. ఇక లక్కీగా సినిమా సక్సెస్ అయి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ప్యారడైజ్ సినిమా విషయంలో కూడా మొదట ఒక బడ్జెట్ అనుకొని ఇప్పుడు బడ్జెట్ ను విపరీతంగా పెంచేయడం పట్ల ప్రొడ్యూసర్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
నాని సైతం శ్రీకాంత్ ఓదెల మీద కొంతవరకు కోపంతో ఉన్నారట. ఇక నాని సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా అతనికి 100 కోట్ల కలెక్షన్స్ రావడమే చాలా కష్టతరం అవుతున్న రోజుల్లో 250 కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టిస్తున్నారు అంటే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించాల్సి ఉంటుంది.
ముందు ఒక బడ్జెట్ ని ఎస్టిమేషన్ వేసి దాన్ని కంట్రోల్ చేయగలిగేతేనే దర్శకుడు సక్సెస్ అవుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా విషయంలో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…